ETV Bharat / city

సౌర ఉత్పత్తికి టెండర్లు వేసే వాళ్లే లేరు : కేంద్ర మంత్రి ఆర్​.కె సింగ్ - సోలార్ టెండర్లపై ఆర్ కె సింగ్ కామెంట్స్

ఏపీ లాంటి కొన్ని రాష్ట్రాల వైఖరితో సౌర విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటుకు టెండర్లు వేసేవారి సంఖ్య బాగా తగ్గిపోయిందని కేంద్ర మంత్రి ఆర్​.కె సింగ్ అన్నారు.  కొన్ని రాష్ట్రాల  విద్యుత్తు పంపిణీ సంస్థలు సకాలంలో బిల్లులు చెల్లించకపోవడం, విద్యుత్తు నియంత్రణ సంస్థలు టారిఫ్ నిర్ధారణలో జాప్యం చేయడం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పీపీఏలను పునఃసమీక్షించడానికి సిద్ధమవడం లాంటివి ఇందుకు ముఖ్య కారణాలని ఆర్​.కె. సింగ్ చెప్పారు.

rk singh
సోలార్ టెండర్లు వేసే వాళ్లే లేరు : కేంద్ర మంత్రి ఆర్​.కె సింగ్
author img

By

Published : Nov 30, 2019, 6:24 AM IST

ఆంధ్రప్రదేశ్ లాంటి కొన్ని రాష్ట్రాల వైఖరి వల్ల.. సౌర విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటుకు టెండర్లు వేసేవారి సంఖ్య బాగా తగ్గిపోయిందని కేంద్ర విద్యుత్తు, పునరుత్పాదక ఇంధన వనరులశాఖ మంత్రి ఆర్​.కె. సింగ్ అన్నారు. లోక్​సభలో ఓ ప్రశ్నకు సమాధానంగా ఆయన ఈ విషయం చెప్పారు. గతంలో అధికంగా టెండర్లు వచ్చాయని, కానీ కొంతకాలంగా కొన్ని టెండర్లకు అసలు ఆదరణ కనిపించలేదని చెప్పారు. ఇందుకు రకరకాల కారణాలున్నాయన్నారు. కొన్ని రాష్ట్రాల విద్యుత్తు పంపిణీ సంస్థలు సకాలంలో బిల్లులు చెల్లించకపోవడం, విద్యుత్తు నియంత్రణ సంస్థలు టారిఫ్ నిర్ధారణలో జాప్యం చేయడం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పీపీఏలను పునఃసమీక్షించడానికి సిద్ధమవడం లాంటివి ఇందుకు ముఖ్య కారణాలని ఆర్​.కె. సింగ్ చెప్పారు. అధికంగా ఉన్న సౌర, పవన విద్యుత్తు ధరలను తగ్గించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నతస్థాయి సంప్రదింపుల కమిటీని ఏర్పాటు చేయడం లాంటి చర్యలు పెట్టుబడిదారుల విశ్వాసంపై తీవ్ర ప్రభావం చూపాయన్నారు. అందుకే కేంద్ర పునరుత్పాదక ఇంధనశాఖ పీపీఏలకు తప్పనిసరిగా కట్టుబడి ఉండాలని, అవినీతి జరిగినట్లు స్పష్టమైన ఆధారాలుంటే తప్ప వాటిని పునఃసమీక్షించడానికి వీల్లేదని చెప్పినట్లు కేంద్రమంత్రి ఆర్​.కె సింగ్ వెల్లడించారు.

ఇదీ చదవండి :

పీపీఏలపై పునఃసమీక్ష అనవసరం...సీఎం జగన్​కు కేంద్రమంత్రి​ లేఖ

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.