- — G Kishan Reddy (@kishanreddybjp) March 30, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
— G Kishan Reddy (@kishanreddybjp) March 30, 2021
">— G Kishan Reddy (@kishanreddybjp) March 30, 2021
కొవిడ్ బాధితులను వెలివేయడం మానవత్వం అనిపించుకోదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కరోనా మహమ్మారిని ఎదుర్కోవటానికి పరస్పర సహకారంతో ముందుకెళ్లాలని సూచించారు. ఆదిలాబాద్‌లో కొవిడ్ పాజిటివ్ యువతిని బహిష్కరించిన సంఘటన అత్యంత దురదృష్టకరమని వ్యాఖ్యానించారు.
ఈనాడు - ఈటీవీ భారత్లో వచ్చిన కథనానికి మంత్రి స్పందించారు. ఈ మేరకు కిషన్‌రెడ్డి ట్విట్టర్ వేదికగా తెలియజేశారు. ఈ అంశంపై వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ డీజీపీ, ఆదిలాబాద్ జిల్లా ఎస్పీకి సూచిస్తున్నట్లు కేంద్ర మంత్రి పేర్కొన్నారు.
ఇదీ చదవండి: ఇద్దరు పిల్లలకు విషమిచ్చి తండ్రి ఉరేసుకుని ఆత్మహత్య