ETV Bharat / city

Kishan Reddy: కృష్ణా జలాలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు - జల వివాదంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యల వార్తలు

G Kishan Reddy
G Kishan Reddy
author img

By

Published : Jul 4, 2021, 7:08 PM IST

Updated : Jul 4, 2021, 8:11 PM IST

19:06 July 04

Kishan Reddy

కృష్ణా జలాల వినియోగంలో తెలంగాణ ప్రభుత్వం అవగాహనా రాహిత్యంతో వ్యవహరిస్తోందని కేంద్రమంత్రి కిషన్​రెడ్డి విమర్శించారు. తెరాస నేతలు కేంద్రంపై నింద మోపే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఇది సరైన పద్ధతి కాదని హితవు పలికారు. హైదరాబాద్​లో నిర్వహించిన భాజపా కార్యవర్గ సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

ఆత్మ నిర్భర్​ భారత్ పేరుతో దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేసిందని కిషన్​రెడ్డి పేర్కొన్నారు. చిరు వ్యాపారులు, మహిళా పొదుపు సంఘాలు, పేద ప్రజలను అన్ని రకాలుగా ఆదుకునేలా ప్రధాని మోదీ పని చేస్తున్నారని తెలిపారు. ఆత్మ నిర్భర్ భారత్​లో తెలంగాణకు ఏం వచ్చిందని కేసీఆర్ అంటున్నారన్న కిషన్​రెడ్డి.. రాష్ట్రానికి కేంద్రప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలబడిందని తెలిపారు. గత ఏడాది నుంచి పేదవాళ్లందరికి 5 కిలోల బియ్యం కేంద్రం నుంచే అందిస్తున్నామని వివరించారు.

కేంద్ర నిధులతోనే ధాన్యం కొనుగోళ్లు..

కేంద్ర ప్రభుత్వ సహకారం, నిధులతోనే తెలంగాణ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేస్తోందని కిషన్​రెడ్డి అన్నారు. సన్న వడ్లు పండించాలని రైతులను ఇబ్బంది పెట్టి... నష్టాలు రావడానికి సీఎం కేసీఆరే కారణమయ్యారని ధ్వజమెత్తారు. హుజురాబాద్​లో పోటీ భాజపా, తెరాస మధ్యే ఉంటుందని కిషన్​రెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్​కు ఓటు వేస్తే గాంధీ భవన్ దారంతా మళ్లీ తెలంగాణ భవన్​కే మళ్లుతుందని విమర్శించారు. తెలంగాణలో తెరాసకు ప్రత్యామ్నాయం భాజపానే అని తేల్చి చెప్పారు.

ఇదీ చదవండి:

TS Govt Letter to KRMB: కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ

Last Updated : Jul 4, 2021, 8:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.