రాష్ట్రాలు ఇచ్చిన సూచనల ఆధారంగానే జోన్లు విభజించామని హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లుగా విభజించి మార్గదర్శకాలు ఇచ్చినట్లు చెప్పారు. రాష్ట్రాల కోరిక మేరకే లాక్‌డౌన్‌ను పొడిగించామన్నారు. వలస కూలీలు ఎక్కడ ఎవరున్నారో గుర్తించి వారిని స్వస్థలాలకు చేరుస్తామని చెప్పారు. ఎవరిని తరలించాలో రాష్ట్ర ప్రభుత్వ నోడల్ అధికారులే నిర్ణయిస్తారని చెప్పారు. దూరంతో సంబంధం లేకుండా టికెట్ ధర 50రూపాయలుగా నిర్ణయించామని చెప్పారు. కంటైన్మెంట్ జోన్లలో కర్ఫ్యూ తరహా వాతావరణం ఉండేలా చూడాలని సూచించారు. గ్రీన్ జోన్‌లో ఆర్థిక కార్యకలాపాలు సాగించే వెసులుబాటు ఉందన్నారు.
కరోనా నివారణ చర్యలతో కొన్ని జిల్లాల్లో కేసులు తగ్గుతున్నాయని వెల్లడించారు. దేశవ్యాప్తంగా 774 కొవిడ్ ప్రత్యేక ఆస్పత్రులు ఉండగా వాటిలో 2.52 లక్షల పడకలు ఏర్పాటు చేశామన్నారు. ఆస్పత్రుల్లో 27 వేల ఐసీయూ పడకలతో 19,398 వెంటిలేటర్లను కేంద్రం సిద్ధం చేసిందని చెప్పారు. 2 కోట్ల 22 లక్షల పీపీఈ కిట్లను తయారు చేయాలని నిర్ణయించామన్నారు. 2.5 కోట్ల కొవిడ్ మాస్కులు భారత్‌లోనే తయారుచేస్తున్నామని చెప్పారు. 30 కోట్ల హైడ్రాక్సీ క్లోరోక్విన్ మాత్రలు సిద్ధం చేస్తున్నామని పేర్కొన్నారు.
కరోనా సహాయ చర్యలు వదిలి పాకిస్థాన్ సిగ్గుమాలిన చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. పాక్ ప్రజలు కరోనాతో చనిపోతున్నా అక్కడి పాలకులు పట్టించుకోవడం లేదన్నారు. 3 నెలలుగా సరిహద్దుల్లో కాల్పులకు తెగబడుతోందని ఆగ్రహించారు. సరిహద్దుల్లో ఉగ్రవాదులను భారత్‌లోకి పంపేందుకు ప్రయత్నిస్తోందని తెలిపారు. ఈ ప్రయత్నాలను సహించేది లేదన్నారు.
ఇదీ చూడండి: