ETV Bharat / city

Jyotiraditya Scindia: ఆ రాష్ట్ర ప్రజల్లో భాజపాపై విశ్వాసం పెరుగుతోంది: సింధియా - జ్యోతిరాదిత్య సింధియా తాజా వార్తలు

తెలంగాణ ప్రజల్లో భాజపాపై విశ్వాసం పెరుగుతోందని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అన్నారు. పార్లమెంటు, జీహెచ్​ఎంసీ ఎన్నికల ద్వారా మంచి ఫలితాలు కనిపించాయని పేర్కొన్నారు. విమానయానరంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చామన్న ఆయన.. రాష్ట్రంలో నూతన విమానశ్రయాల ఏర్పాటుకు సుముఖంగా ఉన్నామని చెప్పారు.

అక్కడి ప్రజల్లో భాజపాపై విశ్వాసం పెరుగుతోంది

author img

By

Published : Sep 11, 2021, 6:06 PM IST

డ్రోన్ల ద్వారా ఔషధాల సరఫరా ఒక గొప్ప మార్పు తెస్తుందని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ధీమా వ్యక్తం చేశారు. విమానయాన రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చామని ఆయన అన్నారు. డిజిటల్‌ ఎయిర్‌ స్పేస్‌ మ్యాప్‌ ద్వారా అనుమతులు సులభతరం చేశామని చెప్పారు. తెలంగాణలోని వికారాబాద్​లో "మెడిసిన్ ఫ్రమ్ ది స్కై(medicine from the sky)" ప్రాజెక్టును ప్రారంభించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

ఎయిర్‌ స్పేస్‌ను మూడు భాగాలుగా విభజించి అనుమతులు ఇస్తున్నామని సింధియా అన్నారు. తద్వారా డ్రోన్లకు అనుమతులు, నిర్వహణను సులభతరం చేశామని వెల్లడించారు. విమానాశ్రయం విస్తరించాలనే తెలంగాణ ప్రభుత్వ కోరిక మేరకు.. కొత్త విమానాశ్రయాల ఏర్పాటుపై చర్చించామని చెప్పారు. వరంగల్‌, ఆదిలాబాద్‌లో బ్రౌన్ ఫీల్డ్‌ విమానాశ్రయాల నిర్మాణానికి సుముఖంగా ఉన్నామని వెల్లడించారు.

అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా ఒక సీటు మాత్రమే గెలుచుకుందని చెప్పిన ఆయన.. పార్లమెంటు, జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు వచ్చేసరికి ఓటర్లు భాజపాను ఆదరించారని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల్లో భాజపాపై విశ్వాసం పెరుగుతోందని వెల్లడించారు.

ఇదీ చదవండి: TS News: డ్రోన్ల ద్వారా ఔషధాలు..'మెడిసిన్ ఫ్రమ్ ది స్కై' ప్రాజెక్టు ప్రారంభం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.