మార్గదర్శకాలు ఇవీ..
- కరోనాకు సంబంధించిన లక్షణాలు అతి స్వల్పంగా ఉన్నట్లు, అసలేమీ లక్షణాల్లేవని వైద్యుడు నిర్ధారించాలి.
- అలాంటి వారికి ఇళ్లలో వసతులుంటే.. వారి కుటుంబీకులతో కలవకుండా విడిగా గదిలో ఉండాలి.
- ప్రభుత్వాసుపత్రి, వైద్యసిబ్బందితో నిరంతరం సమాచార మార్పిడికి అనుగుణంగా అందుబాటులో ఉండాలి.
- ఈ వ్యక్తితో పాటు కుటుంబ సభ్యులు హైడ్రాక్సీ క్లోరోక్విన్ మాత్రలను వైద్యుల సూచనల మేరకు ముందస్తుగా వినియోగించాలి.
- ఆరోగ్యసేతు యాప్‌ను మొబైల్‌లో తప్పనిసరిగా డౌన్‌లోడ్ చేసుకోవాలి. బ్లూటూత్, వైఫై సేవలు మొబైల్‌లో నిరంతరం పనిచేస్తుండాలి.
- జిల్లా వైద్యాధికారి, వైద్యసిబ్బందికి తన ఆరోగ్య సమాచారాన్ని ఎప్పటికప్పుడూ తెలియజేస్తుండాలి.
- ఇంటికి వైద్యసిబ్బంది వచ్చి పరీక్షించడానికి తన అంగీకారాన్ని తెలుపుతూ నిరభ్యంతర పత్రంపై సంతకం చేయాలి.
- నిర్దేశిత గడువు పూర్తయిన అనంతరం నమూనాలను పరీక్షలకు పంపిస్తారు. అవి నెగిటివ్ అని నిర్ధారణ అయ్యాకనే ఇంట్లో ఐసోలేషన్ నుంచి విముక్తి పొందుతారు.
ఈ సమయాల్లో అప్రమత్తమవ్వాలి?
- ఇంట్లో విడి గదిలో ఉన్న సమయంలో ఎలాంటి అస్వస్థత అనిపించినా వైద్యుడిని సంప్రదించాలి. 1075 నంబరుకు ఫోన్ చేయాలి.
- శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదురైనప్పుడు
- ఆగకుండా నొప్పి, ఛాతీలో పట్టేసినట్లుగా ఉన్నప్పుడు
- మానసిక అయోమయం, చేతల్లో స్థిరత్వం లోపించినప్పుడు
- పెదవులు, ముఖం నీలిరంగులో మారుతున్నప్పుడు
ఇంట్లో జాగ్రత్తలు
- నిరంతరం మూడంచెల మాస్కు ధరించాలి. 8 గంటలకొకసారి దాన్ని మార్చాలి.
- వాడేసిన మాస్కును ఒకశాతం సోడియం హైపోక్లోరైట్ ద్రావణంతో శుభ్రపర్చి పడేయాలి.
- పిల్లలు, వృద్ధులు, అధిక రక్తపోటు, మధుమేహం, మూత్రపిండాలు, గుండె, కాలేయ సమస్యలతో దీర్ఘకాలంగా బాధపడుతున్న వారికి దూరంగా ఉండాలి.
- ఇంట్లో సాధ్యమైనంత వరకూ విశ్రాంతి తీసుకోవాలి.
- నీరసంగా ఉండకుండా నీరు, ఇతర ద్రావణాలను సేవించాలి.
- చేతులను ఆల్కహాల్ ఆధారిత శానిటైజర్‌తో ఎప్పటికప్పుడు శుభ్రపర్చుకోవాలి.
- ఈ వ్యక్తి వాడిన దుస్తులు, వస్తువులను ఇతరులు వినియోగించరాదు.
ఇదీ చూడండి: భళా ఈశాన్య భారతం- కరోనా రహితంగా ఆ ఐదు రాష్ట్రాలు