Review On Bifurcation: విభజన సమస్యలపై కేంద్ర హోంశాఖ సమావేశం జరిగింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా దృశ్యమాధ్యమం ద్వారా సమీక్ష నిర్వహించారు. పెండింగ్‌లో ఉన్న విభజన సమస్యల పరిష్కారంపై సమీక్షించారు.
ఈ సమావేశంలో ప్రధానంగా తొమ్మిది అంశాలపై చర్చ జరిగింది. సింగరేణి అనుబంధ సంస్థ ఆప్మెల్, దిల్లీలో ఏపీ భవన్ విభజనపై అధికారులు చర్చించారు. విభజన చట్టం 9, 10 షెడ్యూళ్లలోని సంస్థలు, విద్యుత్ బకాయిలు, పన్ను చెల్లింపులు, రిఫండ్ అంశాలపై ఈ సమావేశంలో చర్చ జరిపారు. బ్యాంకు ఖాతాల్లో నగదు పంపకాలు, విభజన చట్టంలో పేర్కొనని సంస్థల విభజనపైనా చర్చ జరిగింది. ఏపీ జెన్కోకు తెలంగాణ డిస్కంలు చెల్లించాల్సిన బకాయిలపై చర్చకు తీసుకువచ్చారు.
ఇదీ చదవండి:
MP RRR: 'హీరో ఎవరో.. కీచకుడు ఎవరో తేలుద్దాం.. అంతా ఒక్కటై రావణరాజ్యాన్ని అంతం చేద్దాం'