2019 ఏప్రిల్ 1 నుంచి రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు, కార్పొరేషన్లు.. 10 ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి 56 వేల 76 కోట్ల రుణం తీసుకున్నట్లు కేంద్రం వెల్లడించింది. రాజ్యసభలో ఏపీ ప్రభుత్వ సంస్థలు, కార్పొరేషన్లు తీసుకున్న రుణాల వివరాలను వెల్లడించాలని కనకమేడల రవీంద్రకుమార్ కేంద్రాన్ని కోరారు. ఈ ప్రశ్నకు కేంద్రం లిఖిత పూర్వక సమాధానం ఇచ్చింది. ఎస్‌బీఐ నుంచి అత్యధికంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సంస్థలు, కార్పొరేషన్లు 15 వేల 47 కోట్లు రుణం తీసుకున్నట్లు వెల్లడించింది.
బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి 9 వేల 450 కోట్లు, బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి 7 వేల 75 కోట్లు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి 6 వేల 800 కోట్లు, పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి 5వేల 797 కోట్లు రుణం తీసుకున్నట్లు వివరించింది. ఇండియన్ బ్యాంక్ 4వేల 300 కోట్లు, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 2వేల 800 కోట్లు, కెనరా బ్యాంక్ 2వేల 307 కోట్లు, పంజాబ్ అండ్ సింథ్ బ్యాంక్ 750 కోట్లు అప్పులు ఇచ్చినట్లు వెల్లడించింది.