ETV Bharat / city

పెట్టుబడుల ఉపసంహరణకు కీలక నిర్ణయాలు - budget 2021-22 disinvestments news

పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియను మరింత వేగవంతం చేసేలా బడ్జెట్‌లో కీలక నిర్ణయాలు తీసుకుంది కేంద్రప్రభుత్వం. ప్రభుత్వ రంగ బ్యాంకులు, సంస్థల్లో ప్రైవేటు పెట్టుబడులను ఆహ్వానించటం ద్వారా... నిధుల సమీకరణ.... వ్యవస్థాగత నిర్వహణలను మెరుగుపరిచే దిశగా అడుగులు వేసింది. ఆర్థిక స్వావలంబన లక్ష్యం సాధించేదిశగా సరికొత్త ప్రణాళికలను ప్రకటించింది. పెట్టుబడుల ఉపసంహరణను వేగవంతం చేయడం ద్వారా 1.75 లక్షల కోట్లు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు బడ్జెట్లో ప్రకటించారు.. కేంద్ర ఆర్ధికమంత్రి.

budget 2021-22
బడ్జెట్ 2021-22
author img

By

Published : Feb 2, 2021, 1:09 PM IST

బడ్జెట్ 2021-22

కరోనా పరిణామాలతో దేశీయ ఆర్థిక వ్యవస్థ పీకల్లోతు కష్టాల్లో కూరకుపోయిన నేపథ్యంలో పెట్టుబడుల ఉపసంహరణను మరింత బలంగా ముందుకు తీసుకుని వెళ్తోంది... కేంద్ర ప్రభుత్వం. రానున్న అర్థిక సంవత్సరంలో కూడా రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులు.. ఒక జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీని ప్రైవేటీకరించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఇందులో భాగంగా ఐడీబీఐ బ్యాంకు, బీపీసీఎల్, షిప్పింగ్ కార్పొరేషన్, కంటెయినర్ కార్పొరేషన్, నీలాంచల్ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్, పవన్ హాన్స్, ఎయిర్ ఇండియా కంపెనీల్లో వ్యూహాత్మక వాటాలు కొనుగోలు చేసేందుకు ప్రైవేటు సంస్థలకు అవకాశం కల్పించనున్నారు. మరోవైపు ఒక ఇన్సూరెన్స్ సంస్థతోపాటు ఇప్పటికే వాటాల విక్రయం ప్రకటించి ఉన్న కంపెనీల్లో పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియను ఈ ఏడాది పూర్తి చేయనున్నారు. ఎల్ఐసీ ఐపీఓ చేపట్టేందుకు అవసరమైన చట్టబద్ధమైన సవరణను ఈ ఆర్థిక సంవత్సరంలో తీసుకురానున్నట్లు కేంద్రం ప్రకటించింది.

క్రమంగా ప్రైవేటు భాగస్వామ్యం

ప్రభుత్వం ప్రకటించిన ప్రణాళిక ప్రకారం... పెట్టుబడులు ఉపసంహరించే రంగాలను వ్యూహాత్మక, వ్యూహాత్మకేతర రంగాలుగా విభజించారు. ఈ మేరకు నాలుగు వ్యూహాత్మక రంగాలను మినహాయించి, మిగిలిన ప్రభుత్వ కంపెనీల్లో క్రమంగా ప్రైవేటుకు భాగస్వామ్యం కల్పిస్తారు. వ్యూహాత్మక విభాగంలో పెట్టుబడులు ఉపసంహరించాల్సిన ప్రభుత్వ రంగ కంపెనీలు, సంస్థలను గుర్తించి, జాబితా సిద్ధం చేయాలని బడ్జెట్ ప్రసంగం సందర్భంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నీతిఆయోగ్ ను కోరారు. నష్టాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను మూసివేసే పక్రియను త్వరతగతిన నిర్వహించేందుకు మెరుగైన పద్ధతిని రూపొందించాలని సూచించారు. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాలను విక్రయించేందుకు రాష్ట్రాలకు ప్రోత్సాహకాలు అందించనున్నారు. ఇందుకోసం ఆయా సంస్థలకు చెందిన భూములను వినియోగించుకునే ప్రణాళికను అభివృద్ధి చేయాలని కోరారు.

లక్ష్యం 1.75 లక్షల కోట్లు

పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో 1.75 లక్షల కోట్లు సేకరించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. గతేడాది లక్ష్యంతో పోల్చుకున్నప్పుడు ఈ లక్ష్యాన్ని తగ్గించుకున్నారు. పోయిన ఏడాది 2.1 లక్షల కోట్లుగా లక్ష్యం విధించుకోగా... సీపీఎస్ఈల‌్లో వాటాల విక్రయం ద్వారా 19వేల 499 వేలకోట్లు మాత్రమే సేకరించారు. ఆ అనుభవం దృష్ట్యా ఈ ఏడాది లక్ష్యాన్ని తగ్గించుకున్నట్లు కనిపిస్తోంది. కరోనా పరిస్థితిని అనుకూలంగా మలుచుకుని ప్రభుత్వ రంగం సంస్థలను ప్రైవేటు మార్కెట్​లోకి పరుగలు పెట్టించాలన్నది ప్రభుత్వ వ్యూహంగా కనిపిస్తోంది. ప్రస్తుతం దేశీయ మార్కెట్ ఆశాజనకంగా ఉన్న నేపథ్యంలో... విదేశీ మార్కెట్లు పుంజుకోక ముందే... ప్రభుత్వ సంస్థల్లో వాటాలను విక్రయించడం ద్వారా పెట్టుబడులను ఆకర్షించాలనే ధోరణి కనిపిస్తోంది.

ఎల్​ఐసీ ఆస్తుల మదింపునకు కసరత్తులు

గతేడాది అంచనాల ప్రకారం ఎల్ఐసీ ఆస్తుల విలువ 32 లక్షల కోట్ల రూపాయలుగా ఉంది. మరో 31లక్షల కోట్ల రూపాయల ‘లైఫ్‌ ఫండ్‌’ ఉంది. ఈ అచనాలు కేవలం ‘బుక్‌ వాల్యూ’మాత్రమేనని ప్రభుత్వం భావిస్తోంది. వాటి మార్కెట్‌ విలువ ఈ అంచనాలను మించి ఉంటుందన్నది ఆర్థిక నిపుణుల అభిప్రాయం. పెరుగుతున్న స్థిరాస్తి రంగ లెక్కల ప్రాతిపదికన వీటి విలువ కూడా ఎక్కువగా పెరుగుతుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎల్ఐసీ ఆస్తుల విలువను మదింపు వేయడం కోసం రెండు ప్రత్యేక సంస్థలను ఏర్పాటు చేశారు. ఎల్ఐసీని ప్రైవేట్ ఇష్యూకు అందుబాటులో ఉంచడం ద్వారా చిన్న మదుపరులకు కూడా లాభాల్లో వాటా దక్కుతుందన్నది ప్రభుత్వం విధానంగా కనిపిస్తోంది.

ఇదీ చదవండి: బడ్జెట్​: ఆకర్షణీయ పథకాలకు దూరం.. ఆదాయానికే ప్రాధాన్యం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.