ETV Bharat / city

జాతీయ రహదారుల అభివృద్ధికి కేంద్రం నిధులు.. ఎంతంటే? - NHAI Projects

NHAI Projects in AP: రాష్ట్రంలోని జాతీయ రహదారుల మౌలిక సదుపాయాలను మెరుగుపర్చేందుకు.. కేంద్రం నిధులు మంజూరు చేసినట్టు ఆ శాఖ ముఖ్యకార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు వెల్లడించారు. 2022-23 ఆర్ధిక సంవత్సరంలో కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వశాఖ 12,123 కోట్ల రూపాయల్ని మంజూరు చేసినట్టు తెలిపారు.

author img

By

Published : Apr 21, 2022, 3:46 PM IST

NHAI Projects in AP: రాష్ట్రంలోని జాతీయ రహదారుల మౌలిక సదుపాయాలను మెరుగుపర్చేందుకు.. కేంద్రం నిధులు మంజూరు చేసినట్టు ఆ శాఖ ముఖ్యకార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు వెల్లడించారు. 2022-23 ఆర్ధిక సంవత్సరంలో కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వశాఖ 12,123 కోట్ల రూపాయల్ని మంజూరు చేసినట్టు తెలిపారు. గతేడాది 6,530 కోట్లు కేటాయించినా.. పలు ప్రాజెక్టుల కింద 7,865 కోట్లు మంజూరు చేయించుకోగలిగినట్టు వెల్లడించారు.

జాతీయ రహదారుల సంస్థ చేపట్టిన పనులతోపాటు ఈ ఏడాది ప్రతిపాదించిన ప్రాజెక్టులకు కూడా పరిపాలనా అనుమతులు తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు కృష్ణబాబు తెలిపారు. ఈ ప్రాజెక్టులు ఇండస్ట్రియల్ నోడ్స్, ఎకనామిక్ జోన్లు, పర్యాటక ప్రదేశాలను అనుసంధానం చేయనున్నట్టు వివరించారు. తద్వారా.. రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయంతో పాటు లాజిస్టిక్ సామర్ధ్యం కూడా మెరుగు పడుతుందని తెలిపారు. ఏడాదిలోగా అన్ని ప్రాజెక్టులనూ ప్రారంభించేలా డీపీఆర్ లు సిద్ధం చేయటంతోపాటు భూసేకరణ పనులు కూడా చేపడతామని తెలిపారు.

ఇదీ చదవండి: మంత్రి రోజా ఫోన్ కొట్టేశాడు.. పోలీసులు అలా పట్టేశారు..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.