గోదావరి నదిపై పురుషోత్తపట్నం, పట్టిసీమ ఎత్తిపోతల పథకాలకు సంబంధించి సంయుక్త నిపుణుల కమిటీ సమర్పించిన నివేదిక ప్రకారం ఏం చర్యలు తీసుకున్నారో తమకు నివేదించాలని రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (ఏపీ పీసీబీ)ని కేంద్ర పర్యావరణ శాఖ ఆదేశించింది. పర్యావరణ అనుమతులు లేకుండా ఈ ప్రాజెక్టులు నిర్మించారని, తద్వారా గోదావరి డెల్టా ప్రయోజనాలకు భంగం వాటిల్లుతోందంటూ జమ్ముల చౌదరయ్య, మడిశర్ల సత్యనారాయణ, మాజీ మంత్రి వట్టి వసంతకుమార్ వేర్వురుగా జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ)ను ఆశ్రయించారు.
ఈ పిటిషన్లను సెప్టెంబరు 9న విచారించిన ఎన్జీటీ.. పర్యావరణానికి హాని, నష్టపోయే రైతులు, వారికి చెల్లించాల్సిన పరిహారంపై నివేదిక సమర్పణకు సంయుక్త నిపుణుల కమిటీని నియమించింది. ఎన్జీటీ తదుపరి విచారణ 2021 ఏప్రిల్ 12న ఉన్నందున.. ఆలోగా కమిటీ నివేదిక ప్రకారం తీసుకున్న చర్యలతో కూడిన నివేదికను తమకు సమర్పించాలని ఏపీ పీసీబీని కేంద్ర పర్యావరణ శాఖ ఆదేశించింది.
ఇదీ చదవండి: