Caveat petition on Capital issue: రాష్ట్ర రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సర్వోన్నత న్యాయస్థానంలో కేవియట్ పిటిషన్లు దాఖలయ్యాయి. శాసన, కార్యనిర్వహక, న్యాయ వ్యవస్థలను వేర్వేరు ప్రాంతాలకు తరలిస్తూ శాసనం చేసే అధికారం శాసనసభకు లేదని ఈ నెల 3న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం లేదా మరెవరైనా ఈ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తే.. తమకు నోటీసులు జారీ చేసి తమ వాదనలు విన్న తర్వాతే తీర్పు ఇవ్వాలంటూ మాజీ ఎమ్మెల్సీ అమ్మినేని శ్రీరామకృష్ణ, గుంటూరు మిర్చి యార్డు మాజీ ఛైర్మన్ మన్నవ సుబ్బారావు, రైతులు దియ్య రామకృష్ణప్రసాద్, చిగురుపాటి సూర్యనారాయణ వేర్వేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
ఇదీ చదవండి: రాజధాని అమరావతే... మార్చే శాసనాధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు: హైకోర్టు