సీఎం జగన్ అక్రమాస్తుల వ్యవహారంలో భాగంగా ఆరబిందో(Aurobindo), హెటిరో, పెన్నా సిమెంట్స్ పై నమోదైన కేసులు వాయిదా పడ్డాయి. అరబిందో, హెటిరో వ్యవహారంలో నిందితులైన హెటిరో కంపెనీతోపాటు ఎండీ శ్రీనివాసరెడ్డి.. తమపై నమోదైన కేసు కొట్టివేయాలని హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వీటి విచారణను నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కొవిడ్ తరణంలో అన్ని మధ్యంతర ఉత్తర్వులు ఈ నెలాఖరు వరకు పొడిగిస్తూ హైకోర్టు ఫుల్ బెంచ్ ఉత్తర్వులు ఇచ్చిన నేపథ్యంలో హెటిరో(Hetero company case) కేసు విచారణను సీబీఐ కోర్టు ఈ నెల 28కి వాయిదా వేసింది.
పెన్నా(penna cements case) కేసులో నిందితుల జాబితాలో ఉన్న పయనీర్ హోల్డింగ్స్ దాఖలు చేసిన డిశ్ఛార్జి పిటిషన్ను సాంకేతిక అభ్యంతరాలతో సీబీఐ కోర్టు కార్యాలయం వాపసు ఇచ్చింది. ఇదే కేసులో మరో కంపెనీ అయిన పి.ఆర్.ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ దాఖలు చేసిన డిశ్చార్జి పిటిషన్ పై విచారణను కోర్టు.. ఈ నెల 29కి వాయిదా వేసింది.
ఇదీ చదవండి..