కోర్టు ధిక్కరణ కేసులో శిక్ష విధించేందుకు తగిన ఉత్తర్వులిస్తామని, ఈ నెల 31న హాజరుకావాలని శాసనసభ కార్యదర్శి పి.బాలకృష్ణమాచార్యులను హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ గురువారం ఈ మేరకు ఆదేశాలు జారీచేశారు. శాసనసభలో పనిచేసే పిటిషనర్లు/టైపిస్టులు, ఆఫీసు అసిస్టెంట్లకు ఇంక్రిమెంట్లు, జీతాలు ఇచ్చే వ్యవహారమై 2017 ఫిబ్రవరిలో హైకోర్టు ఉత్తర్వులిచ్చింది. వాటిని అమలు చేయలేదని పేర్కొంటూ దాఖలైన కోర్టుధిక్కరణ కేసులో న్యాయస్థానం ఆదేశాల మేరకు గురువారం విచారణ జరిగింది. ఆర్థికశాఖ కార్యదర్శి ఎస్.ఎస్.రావత్, పేఅండ్ అకౌంట్స్ అధికారి మోహన్‌రావు, శాసనసభ కార్యదర్శి బాలకృష్ణమాచార్యులు హాజరయ్యారు. బిల్లులు సకాలంలో సమర్పించకుండా శాసనసభ కార్యదర్శి కోర్టు ధిక్కరణకు పాల్పడినట్లు న్యాయమూర్తి ప్రాథమికంగా గుర్తించారు. శిక్ష విధించే నిమిత్తం విచారణను ఈ నెల 31కి వాయిదా వేశారు.
ఇదీ చదవండి: