Grama Sabha : అమరావతి పురపాలక సంఘం ఏర్పాటు కోసం రాజధాని గ్రామాల్లో నిర్వహించిన గ్రామ సభల్లో ప్రజలు ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా తమ ఆకాంక్షను తెలియజేశారు. పురపాలక సంఘం ఏర్పాటుకు మంగళగిరి మండలంలో నీరుకొండ, కురగల్లు గ్రామాల్లోనూ, తుళ్లూరు మండలంలో రాయపూడి, అనంతవరం, నెక్కల్లు, వడ్డమాను గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించారు. సీఆర్డీఏ ప్లాన్ ప్రకారం 29 గ్రామాల సమగ్ర అమరావతే కావాలని డిమాండ్ చేశారు. రైతులంతా పాదయాత్రలో ఉన్న సమయంలో గ్రామసభలు ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు.
ఇవీ చదవండి: