ETV Bharat / city

'మూడు రాజధానుల యత్నాన్ని.. పోరాటం ద్వారా అడ్డుకుంటాం' - మూడు రాజధానులు తాజా వార్తలు

రాజధాని కోసం అమరావతి రైతుల పోరాటం 384వ రోజుకు చేరుకుంది. రాజధాని గ్రామాల్లోని దీక్షా శిబిరాల వద్ద రైతులు, మహిళలు ఆందోళన కొనసాగిస్తున్నారు.

capital farmers protest reached to 384th day
384వ రోజుకు చేరుకున్న రాజధాని రైతుల పోరాటం
author img

By

Published : Jan 4, 2021, 1:51 PM IST

రాజధాని అభివృద్ధి కోసం నమ్మి భూములిస్తే.. ప్రభుత్వం విధ్వంసకర పాలన సాగిస్తోందని మహిళా రైతులు విమర్శించారు. అమరావతి రైతుల పోరాటం 384వ రోజుకు చేరుకుంది. ప్రజావేదిక కూల్చినప్పుడే జనం తిరగబడి ఉంటే.. ఇప్పుడు ఆలయాలు ధ్వంసం చేసే పరిస్థితి తలెత్తేది కాదని మండిపడ్డారు. సంక్షేమం పేరుతో ప్రజల నెత్తిన అప్పు పెట్టటం మినహా.. ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా చేయలేదని ఆరోపించారు. రాజధాని నిర్మాణం పూర్తై ఉంటే ఎందరికో ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు వచ్చేవని అభిప్రాయపడ్డారు.

384వ రోజుకు చేరుకున్న రాజధాని రైతుల పోరాటం

జగన్ ప్రభుత్వం మూడు రాజధానుల ఏర్పాటుకు చేస్తున్న ప్రయత్నాలను తమ పోరాటం ద్వారా అడ్డుకుంటామన్నారు. న్యాయం అమరావతి రైతుల వైపే ఉందని.. కోర్టులో తప్పక విజయం సాధిస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు.

ఇవీ చూడండి...

హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ జోయ్ మల్యబాగ్చి ప్రమాణ స్వీకారం

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.