ETV Bharat / city

పల్లె పోరు: ట్రెండు మారింది బాసూ.. ఇప్పుడంతా ఆన్​లైనే..! - ap politics

గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలు 'నయా' ట్రెండ్ సృష్టిస్తున్నాయి. ఇప్పుడంతా ఆన్​లైన్ మీటింగ్, కార్యకర్తలతో ఛాటింగ్..! కట్ చేస్తే.. 'సిట్టింగ్' సీన్. రాష్ట్రంలో ఎన్నికలు జరిగే పంచాయతీల్లో ఇప్పుడిదే ట్రెండింగ్. అన్ని రాజకీయ పార్టీలు వారి సపోర్టర్లను గెలుపు తీరాలకు చేర్చేందుకు అందుబాటులో ఉన్న అన్ని ఆయుధాలను వాడుతున్నాయి. అయితే... గతంలో లాగా మూస పద్ధతిలో కాదు..! అంతా ఆన్​లైన్​లోనే..! ప్రచార ఖర్చులు మొదలు... గెలుపు సంబరాల వరకు అంతా 'ఆన్​లైన్' ప్లాన్ చేస్తున్నారు.

Candidates Using Smart Phone for Panchayat Elections

author img

By

Published : Feb 3, 2021, 11:01 PM IST

ఎన్నికల్లో గెలుపోటములు ఎలా ఉన్నా... అభ్యర్థులందరూ అప్​డేట్ అవుతున్నారు. ఎలక్షన్ల టైంలో గ్రామాల్లో డబ్బు, మద్యం.. వీటికి కొదవుండదు. అవతలి అభ్యర్థి ఓటుకు ఐదొందలు ఇస్తున్నాడా..? మనం వెయ్యి ఇద్దాం. ప్రచారంలో పాల్గొన్న ఒక్కొక్కరికి క్వాటర్ సీసా, బిర్యాని పొట్లం, రెండొందలా.. మనం ఇంకా ఎక్కువే ఇద్దాం. అనే కామెంట్లు మామూలే. గతంలో ఇవన్నీ చేయాలంటే.. అభ్యర్థులకు అధికారులతో తిప్పలు, పోలీసుల భయం ఉండేది. సెల్​ఫోన్ పుణ్యమాని ప్రస్తుతం పరిస్థితులు మారాయి.

అన్నీ ఆన్​లైన్ యాప్​లోనే...

ఈ ఎన్నికల్లో ఎలాగైన గెలవడానికి అభ్యర్థులందరూ పట్టుదలతో ఉన్నట్టు కనిపిస్తోంది. గత అన్ని ఎన్నికల్లోనూ ఓట్ల కోసం డబ్బులు పంచడం, ఆ కారణంగా గొడవలు అన్నీ చూశాం. ఇప్పుడు ఆ తిప్పలు లేకుండా అధికారులు 'యాప్​' మార్గాన్ని ఎంచుకున్నట్టు జోరుగా ప్రచారం జరుగుతోంది. అభ్యర్థులు తమకు అనుకూలంగా కొందరితో ఓటర్లకు గూగుల్ పే, ఫోన్​పే, యూపీఐ, పేటీఎం వంటి యాప్​ల ద్వారా డబ్బులు పంపేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు ప్రచారం జరుగుతోంది.

స్మార్ట్​ ఫోన్లు లేకపోతే ఎలా..?

అందరికీ అందుబాటులో స్మార్ట్ ఫోన్లు లేకపోతే ఎలా అనే ప్రశ్న ఉత్పన్నమైతే... ఆ కుటుంబంలో ఉన్నవారికి పంపే ప్రయత్నాలు చేస్తున్నారు. మరీ తప్పని పరిస్థితుల్లో పాత పద్ధతినే ఫాలో అయ్యే ఛాన్స్ ఉంది. ఏదీ ఏమైనా మొత్తానికి ఈ పంచాయతీ ఎన్నికలు 'స్మార్ట్' అవుతున్నాయనే చెప్పొచ్చు. ఇలా చేయడానికే చాలామంది అభ్యర్థులు మొగ్గుచూపుతున్నారనే చర్చ జరుగుతోంది. ఇప్పటికే కుగ్రామాల్లో స్మార్ట్ సేవలు విస్తరించిన వేళ... ఎలక్షన్లూ స్మార్ట్ కాబోతున్నాయని ప్రచారం జోరుగా సాగుతోంది.

ఇబ్బందులు..

ఎన్నికల్లో ఎంత ప్లాన్​తో చేసినా... ఎదో ఒక సందర్భంలో తిప్పలు తప్పవు. కేసుల్లో ఇరికించడానికి ప్రత్యర్థులు కాపు కాస్తుంటారు. చిన్న అవకాశం దొరికినా చేసిందంతా పోతుంది. ఎవరైనా ఒకరు డబ్బులు పంపితే... ఆ వివరాలు ప్రత్యర్థులకు చేరితే ఇక అంతే సంగతులు. గతంలో అయినా ఎలాంటి ఫ్రూఫ్ ఉండేది కాదు. కానీ ఇప్పుడు పక్కా ఆధారాలుంటాయి. స్మార్ట్ మార్గం ఎంతో సులభమో.. అంత కష్టం కూడా..!

ప్రకాశం జిల్లాలో కట్టలు తెంచారు...

  1. 2013లో నిర్వహించిన పంచాయతీ ఎన్నికల్లో తాళ్లూరులో అత్యధికంగా ధన ప్రవాహం కొనసాగింది. మొత్తం 4500 ఓటర్లున్న ఓ పంచాయతీలో సర్పంచి పదవి కోసం ఇద్దరు అభ్యర్థులు పోటీ పడ్డారు. వీరిద్దరూ కలిసి రూ.కోటికి పైగా ఖర్చు చేసినట్టు సమాచారం.
  2. దర్శి మండలంలోని మరో గ్రామంలో ఇద్దరు అభ్యర్థులు దాదాపు రూ.కోటి పైగా ఖర్చు చేసినట్టు ప్రచారం.
  3. మార్కాపురం నియోజకవర్గ పరిధిలోనూ ఓచోట అభ్యర్థుల ఖర్చు రూ.అర కోటికి పైగా అయినట్టు తెలిసింది.
  4. చీరాల నియోజకవర్గంలోని మరోక ఊర్లో ఇద్దరు అభ్యర్థుల పంచాయతీ ఎన్నికల ఖర్చు రూ.అర కోటికి పైమాటే. ఇక్కడి కొన్ని పంచాయతీల్లో ఓటుకు రూ.వెయ్యి నుంచి రూ.1500 వరకు వెదజల్లారు.
  5. జిల్లాలోని ఓ గ్రామపంచాయతీలో 3200 మంది ఓటర్లుండగా.. ఒక్కో అభ్యర్థి రూ.25 లక్షలకుపైగా వెచ్చించారు. 2200 మంది ఓటర్లున్న గ్రామంలోనూ అభ్యర్థులు రూ.అర కోటికి పైగానే ఖర్చు చేశారు.
  6. తాళ్లూరు మండలంలోని ఓ పల్లెలో 2007 నాటి పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థులు పోటాపోటీగా నగదు వెదజల్లారు. కేవలం వెయ్యిలోపు ఓటర్లున్న ఈ గ్రామంలో రూ.60 లక్షలకుపైగా ఖర్చు చేశారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.