స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ స్థానాలకు నామినేషన్ల దాఖలుకు (ap Local Authorities Constituency elections) ఇవాళ్టితో గడువు ముగిసింది. అధికార పార్టీతో పాటు ఇండిపెండెంట్ల నుంచి మొత్తం 20 నామినేషన్లు దాఖలు అయినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. వైకాపా తరఫున 12 నామినేషన్లు వేశారు. ఐదు చోట్ల ఇండిపెండెంట్లు కూడా నామినేషన్లు వేసినట్టు ఎన్నికల సంఘం వెల్లడించింది. అనంతపురం నుంచి వై. శివరామిరెడ్డితో పాటు మరో అభ్యర్థి ఇండిపెండెంట్‌గా నామినేషన్ వేశారు.
కృష్ణా జిల్లాలోని రెండు సీట్లకు గాను మొండితోక అరుణ్ కుమార్, తలసిల రఘురాం, ధూళిపాల శ్రీకాంత్‌లు నామినేషన్లు వేశారు. తూర్పు గోదావరి నుంచి కోళ్లటి ఇజ్రాయెల్, మాకే దేవి ప్రసాద్ లు గుంటూరు జిల్లా నుంచి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, చిత్తూరు నుంచి కృష్ణ రాఘవ జయేంద్ర భరత్ లు నామినేషన్లు దాఖలు చేశారు. విజయనగరం నుంచి ఇందుకురి రఘురాజు విశాఖ జిల్లా నుంచి రెండు సీట్లకుగాను వరుదు కల్యాణి, చెన్నుబోయిన శ్రీనివాసరావు, మురుగుడు హనుమంతరావు నామినేషన్ వేశారు. ఇండిపెండెంట్లుగా షేక్ షఫీ ఉల్లా, నాయుడు గారి రాజశేఖర్ లు నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. ప్రకాశం జిల్లా నుంచి తూమటి మాధవరావు వైకాపా అభ్యర్థులుగా నామినేషన్లు వేశారు.
రేపు నామినేషన్ల పరిశీలన.. డిసెంబర్ 10న పోలింగ్..
స్థానిక సంస్థల కోటాలో 11 ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికకు (Local body quota MLC elections)ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. విశాఖపట్నం, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో రెండు స్థానాల చొప్పున.. అనంతపురం, చిత్తూరు, ప్రకాశం, తూర్పుగోదావరి, విజయనగరం జిల్లాల్లో ఒక్కో స్థానానికి నోటిఫికేషన్ ఇచ్చారు. 24న నామినేషన్ల పరిశీలన.. 26వ తేదీ ఉపసంహరణకు తుది గడువుగా రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. డిసెంబరు 10న పోలింగ్ (Polling) జరుగుతుందని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓటింగ్ (Counting) నిర్వహించనున్నారు. డిసెంబరు 16న ఓట్ల లెక్కించి.. అదే రోజు ఫలితాలను విడుదల చేయనున్నారు.
ఇదీ చదవండి:
ప్రభుత్వం మరో కీలక నిర్ణయం..శాసన మండలి రద్దు నిర్ణయం వెనక్కి