ETV Bharat / city

నాలుగో విడతలో నామినేషన్ల దాఖలుకు పోటెత్తిన అభ్యర్థులు

నాలుగో విడత పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్​ల పర్వం ఈరోజుతో ముగియనుంది. నిన్న అమావాస్య కావడంతో నామపత్రాల దాఖలుకు ఆయా జిల్లాల్లో అభ్యర్థులు ఇవాళ క్యూ కట్టారు. తమ మద్దతుదారులతో కలిసి భారీగా నామినేషన్ కేంద్రాల వద్దకు చేరుకున్నారు. కొన్ని చోట్ల నామినేషన్లు వేయడానికి వచ్చిన అభ్యర్థులను చూస్తే.. ఓటర్లు వరుసలో నుంచున్నట్లు అనిపించక మానదు.

author img

By

Published : Feb 12, 2021, 4:35 PM IST

Updated : Feb 12, 2021, 8:07 PM IST

fourth phase elections nominations in ap
నాలుగవ విడతలో నామినేషన్ల దాఖలుకు పోటెత్తిన అభ్యర్థులు

నామినేషన్ కేంద్రాల వద్ద అభ్యర్థులు ఈరోజు పోటెత్తారు. నాలుగో విడత పంచాయతీ ఎన్నికల్లో పోటీకి నామపత్రాల సమర్పణకు ఇవాళ చివరిరోజు కావడంతో.. ఆశావహులు క్యూ కట్టారు. ప్రధాన పార్టీల మద్దతుతో పోటీకి దిగి.. సర్పంచి, వార్డు స్థానాలు సాధించడానికి బరిలోకి దిగారు.

కృష్ణాజిల్లాలో...

తిరువూరు మండలం గానుగపాడులో మాజీ సర్పంచ్ వేమిరెడ్డి నిర్మలమ్మ నామినేషన్ వేశారు. చీమలపాడులో జనసేన మద్దతుతో శొంటాల స్వరూపరాణి, ఎ. కొండూరు మండలం కేశ్యాతండాలో వైకాపా అండతో బరబల జమలమ్మ సర్పంచి అభ్యర్థులుగా నామపత్రాలు దాఖలు చేశారు. మునుకుళ్ల సర్పంచ్ అభ్యర్థిగా.. వైకాపా బలపరిచిన సిరికొండ కుమారి పోటీలో ఉన్నారు.

ఎ. కొండూరు మండలం రామచంద్రాపురం నుంచి సర్పంచి అభ్యర్థిగా తుళ్లూరు గోపాలరావు తెదేపా మద్దతుతో నామినేషన్ వేశారు. పార్టీ నేతలు, కార్యకర్తలు ఈ కార్యక్రమానికి ర్యాలీగా తరలివచ్చారు. ఎంపీపీ అభ్యర్థి తాతా నాగమణి, మండల తెదేపా అధ్యక్షుడు గడ్డి కృష్ణారెడ్డి, మాజీ ఎంపీపీ వాసం మునియ్య, రాష్ట్ర పరిశీలకుడు శ్రీధర్ తదితరులు ఇందులో పాల్గొన్నారు.

గన్నవరం, ఉంగుటూరు, బాపులపాడు మండలాల్లో నామినేషన్లు జోరుగా కొనసాగాయి. మేజర్ పంచాయతీలైన గన్నవరం, బాపులపాడు, కేసరపల్లి, బుద్దవరం, తేలప్రోలు, పెద్దఅవుటపల్లి, వీరవల్లి సహా ఇతర పంచాయతీల్లోనూ నామినేషన్లు వేసేందుకు సర్పంచ్, వార్డు అభ్యర్థులు ఉత్సాహం కనబరిచారు. ప్రధాన పార్టీలు తెదేపా, వైకాపా మద్దతిస్తున్న అభ్యర్థులు పలుచోట్ల భారీ ప్రదర్శనగా వెళ్లి నామపత్రాలు సమర్పించారు. ఒక్కోచోట సర్పంచి పదవికి ఐదుగురుకి పైగా పోటీలో నిలవడం చర్చనీయాంశంగా మారింది.

గుంటూరు జిల్లాలో...

నాలుగో విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్​కు ఇవాళ చివరి రోజు కావడంతో.. ప్రత్తిపాడులో అభ్యర్థులు క్యూ కట్టారు. పంచాయతీ కార్యాలయం వద్ద నామినేషన్ వేసేందుకు వచ్చిన సర్పంచి, వార్డు అభ్యర్థులను చూస్తే.. ఓట్లు వేసేందుకు వరుసలో నుంచున్నట్లు కనిపిస్తోంది. ప్రత్తిపాడు, పెదనందిపాడు, వట్టిచెరుకూరు మండలాల్లో నామినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ప్రత్తిపాడు పంచాయతీ వద్ద నామినేషన్ ప్రక్రియను గుంటూరు అర్బన్ అదనపు ఎస్పీ గంగాధరం పరిశీలించారు. ఎలాంటి సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నట్లు చెప్పారు.

నాలుగో విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ సందడిగా సాగుతోంది. నామపత్రాల సమర్పణకు ఇవాళ చివరి రోజు కావడంతో.. అభ్యర్ధులు భారీగా తరలివస్తున్నారు. గుంటూరు జిల్లా పరిధిలోని 16 మండలాల్లో 266 పంచాయతీలు, 2,810 వార్డులకు ఈ నెల 21న ఎన్నికలు జరగనున్నాయి. పోటీ చేస్తున్న అభ్యర్ధులు తమ మద్ధతుదారులతో వచ్చి ఎన్నికల అధికారులకు నామినేషన్లు అందజేస్తున్నారు.

తూర్పు గోదావరి జిల్లాలో...

ముమ్మడివరం, కాట్రేనికోన, ఐ.పోలవరం మండలాల్లోని 46 పంచాయతీలతో పాటు 522 వార్డు స్థానాలకు నామినేషన్లు సమర్పించేందుకు అభ్యర్థులు పోటెత్తారు. నిన్న అమావాస్య కావడంతో అభ్యర్థులందరూ ఈరోజే నామ పత్రాల సమర్పణకు ముహూర్తాలు పెట్టుకున్నారు. అందరూ ఒకేసారి రావడంతో వారిని నిలువరించడానికి తగిన స్థాయిలో పోలీసులు లేక.. నిబంధనలకు విరుద్ధంగా గుంపులుగా రిటర్నింగ్ అధికారి వద్దకు వెళుతున్నారు. తమకు మద్దతుగా వచ్చిన వారికి అభ్యర్థులు విందు భోజనాలు ఏర్పాటు చేశారు.

అమలాపురం డివిజన్​లో నామినేషన్ కేంద్రాలు కోలాహలంగా మారాయి. నాలుగో విడత పంచాయతీ ఎన్నికల్లో పోటీకి నామపత్రాలు దాఖలుకు ఇవాళ చివరి రోజు కావడంతో.. కొత్తపేట, ఆత్రేయపురం, రావులపాలెం మండలాల్లోని అభ్యర్థులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. 273 పంచాయతీలకు వందల సంఖ్యలో నామ పత్రాలు దాఖలయ్యాయి. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు.

నాలుగో విడత స్థానిక ఎన్నికలకు నామినేషన్లు వేసేందుకు ఇవాళ చివరి రోజు కావడంతో.. కోనసీమలో భారీ బైక్ ర్యాలీలు జరిగాయి. అభ్యర్థులు ఊరేగింపులతో నామినేషన్ వేసేందుకు తరలివచ్చారు. ఆత్రేయపురం, రావులపాలెంలో సర్పంచ్ అభ్యర్థులతో కలిసి ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి నామినేషన్ కేంద్రానికి వెళ్లారు. ఎన్నికల అధికారులకు పలువురు నామపత్రాలు సమర్పించారు.

విశాఖ జిల్లాలో...

పద్మనాభం మండలంలో పంచాయతీ పోరు రసవత్తరంగా సాగనుంది. అధికార పార్టీ ఏకగ్రీవాలు కోసం ప్రయత్నిస్తుండగా.. ప్రతిపక్ష తెదేపా గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధపడుతోంది. మండలంలోని 22 పంచాయతీల్లో వైకాపా అభ్యర్థులు పోటీ చేస్తుండగా... 20 స్థానాల్లో తెదేపా మద్దతుదారులను బరిలో నిలిపింది. నామినేషన్ల పర్వం నేటితో ముగియనున్న నేపథ్యంలో.. అధికార, ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులు బలాబలాలు నిరూపించుకొనేందుకు భారీ ర్యాలీలతో నామినేషన్లు దాఖలు చేశారు. ఇటీవల జరిగిన శాశన సభ ఎన్నికల్లో తెదేపాకు ఇక్కడ ఎదురు దెబ్బ తగిలినా.. పంచాయతీ పోరులో గెలిచి తీరుతామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీ అభ్యర్థులు దౌర్జన్యాలకు, ప్రలోభాలకు పాల్పడినా ఎదురొడ్డి విజయం సాధిస్తామని చెబుతున్నారు.

శ్రీకాకుళం జిల్లాలో...

పోలాకి మండలం మబగంలో సర్పంచ్ అభ్యర్థికి మద్దతుగా జరిగిన ర్యాలీలో ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ పాల్గొన్నారు. ఆయన స్వగ్రామంలోని తన నివాసం నుంచి నామినేషన్ కేంద్రం వరకు ర్యాలీగా వెళ్లి నామ పత్రాలు అందజేశారు.

నాలుగో విడత పంచాయతీ ఎన్నికల్లో పోటీకి.. నరసన్నపేట మేజర్ పంచాయతీ నుంచి నామినేషన్ల దాఖలుకు తెదేపా భారీ ర్యాలీ నిర్వహించింది. సర్పంచ్ అభ్యర్థి బెవర రాముకు మద్దతుగా మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ఇందులో పాల్గొన్నారు. జట్టు యూనియన్ కార్యాలయం నుంచి పంచాయతీ కార్యాలయం వరకు ర్యాలీ సాగింది.

అనంతపురం జిల్లాలో...

జిల్లాలోని 13 మండలాల్లో నామినేషన్ల ప్రక్రియ పోటాపోటీగా కొనసాగుతోంది. చివరి రోజున నామపత్రాలు దాఖలు చేయటానికి పెనుకొండ ఎంపీడీవో కార్యాలయానికి అభ్యర్థులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు చేపట్టారు. మంత్రి శంకర్ నారాయణ చేతుల మీదుగా.. సోమందేపల్లి సర్పంచ్ అభ్యర్థిగా గంగాదేవి నామినేషన్ దాఖలు చేశారు.

అనంతపురం రూరల్ మండలంలోని 24 పంచాయతీలకు 229 మంది సర్పంచి అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. 276 వార్డు స్థానాలకుగాను 718 మంది నామపత్రాలు సమర్పించారు. ఉదయం నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు మూడవ విడత ఎన్నికలకు నామినేషన్ల ఉపసంహరణ జరిగింది. సర్పంచ్ అభ్యర్థుల ఏకగ్రీవం ఎక్కడా లేనట్లు ఎంపీడీవో భాస్కర్ రెడ్డి తెలిపారు. దాదాపు 40 వార్డు స్థానాలు ఏకగ్రీవమైనట్లు చెప్పారు.

నాలుగో నాలుగోవిడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ఘట్టం ఈరోజు ముగియనుండటంతో నామినేషన్ కేంద్రాలకు అభ్యర్థులు పోటెత్తారు. అన్ని పార్టీలకు చెందిన మద్దతుదారులు సర్పంచి, వార్డు స్థానాలకు పోటీ చేసేందుకు పోటీపడ్డారు. హిందూపురంలోని చిలమత్తూరు, లేపాక్షి, హిందూపురం మండలాల్లో ఉదయం నుంచి నామినేషన్ ప్రక్రియ మందకొడిగా సాగినా.. మధ్యాహ్నం తరువాత నామినేషన్ కేంద్రాల వద్ద అభ్యర్థులు పెద్ద ఎత్తున బారులు తీరారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

కడప జిల్లాలో...

నామినేషన్ల దాఖకుకు చివరి రోజున జమ్మలమడుగులో ఈ ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. మొరగుడిలో వైకాపా, భాజపా మద్దతుదారులు నామినేషన్లు వేశారు. ఈ పంచాయితీలో 6 వేలకు పైగా ఓట్లు ఉండటంతో.. ప్రధాన పార్టీలన్నీ ఇక్కడ దృష్టి సారించాయి. గొరిగనూరు, గూడెంచెరువు, పెద్దపసుపుల, ముద్దునూరు తదితర పెద్ద పంచాయతీల్లో భారీగా నామినేషన్లు వేస్తున్నట్లు పోలీస్ అధికారులు తెలిపారు.

కర్నూలు జిల్లాలో...

ఎమ్మిగనూరులో నాలుగ విడతకు నామినేషన్​ల చివరి రోజున.. అభ్యర్థులు భారీగా తరలివచ్చారు. నామినేషన్ కేంద్రాల వద్ద సందడి వాతావరణం నెలకొంది. అభ్యర్థుల వెంట అనుచరులు పెద్దఎత్తున రావడంతో.. పోలీసులు వారిని నామినేషన్ కేంద్రానికి కొద్ది దూరంలోనే నిలిపివేశారు.

నెల్లూరు జిల్లాలో...

నాలుగో విడత నామినేషన్లకు చివరి రోజు కావడంతో.. నెల్లూరులో అభ్యర్థులు జోరుగా నామపత్రాలు సమర్పించారు. 12 మండలాల్లో తెదేపా, వైకాపా వర్గీయులు నువ్వా నేనా అన్న చందంగా నామినేషన్ వేయడానికి పోటీపడ్డారు. బుచ్చిరెడ్డిపాలెం మండలంలో 47, ఇందుకూరుపేట 38, కొడవలూరు 20, కోవూరు 14, మనుబోలు 39, ముత్తుకూరు 47, నెల్లూరు రూరల్ 28, పొదలకూరు 29, రాపూరు 36, తోటపల్లిగూడూరు 7, వెంకటాచలం 29, విడవలూరు 10తో మొత్తం కలిపి 344 నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు తెలిపారు.

కోవూరు, కొడవలూరు, బుచ్చిరెడ్డిపాలెం, ఇందుకూరుపేట, విడవలూరు మండలాల్లో సర్పంచి, వార్డు స్థానాల కోసం అభ్యర్థులు పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలు చేశారు. భారీగా జనాన్ని సమీకరించి పలు ప్రాంతాల్లో ఉరేగింపుగా వెళ్లి నామపత్రాలు సమర్పించారు. మధ్యాహ్నం 3 గంటల సమయానికి నెల్లూరు డివిజన్ పరిధిలో 344 సర్పంచి, 1456 వార్డు స్థానాలకు నామినేషన్లు వేశారు.

ఇదీ చదవండి:

రెండో దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ ఏర్పాట్లు పూర్తి: జీకే ద్వివేది

Last Updated : Feb 12, 2021, 8:07 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.