ETV Bharat / city

'ఆంధ్రుల ఉజ్వల భవిష్యత్తుకు ఆయువుపట్టు...అమరావతి' - 300days for the amaravathi movement

రాజధాని అమరావతి ఉద్యమం 300రోజులకు చేరటంపై తెదేపా అధినేత చంద్రబాబు స్పందించారు. అమరావతి అనేది 5 కోట్ల ఆంధ్రుల ఉజ్వల భవిష్యత్తుకు ఆయువుపట్టని చంద్రబాబు స్పష్టం చేశారు.

cahandrababu comments on 300days amaravthi protest
తెదేపా అధినేత చంద్రబాబు
author img

By

Published : Oct 12, 2020, 9:03 AM IST

Updated : Oct 12, 2020, 10:25 AM IST

రాష్ట్రమంతా ఒక్కటై అమరావతి కోసం పోరాడాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. రాజధానిని కాపాడుకోవడం రాష్ట్రప్రజలగా అందరి బాధ్యతని స్పష్టం చేశారు. ఇది చారిత్రాత్మక అవసరమని పేర్కొన్నారు. భూములు త్యాగం చేసిన రైతులకు చేస్తోన్న నమ్మకద్రోహాన్ని ప్రశ్నించకపొతే ప్రజాస్వామ్య మనుగడకే ప్రమాదమని హెచ్చరించారు.

రాజధాని అమరావతి పరిరక్షణ కోసం ప్రజలు చేస్తోన్న ఉద్యమo 300 రోజులకు చేరిందని గుర్తు చేసిన చంద్రబాబు... ఇందులో 92 మంది రైతులు, రైతు కూలీలు, మహిళలు అమరులయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. అయినా ప్రభుత్వం ప్రజల ఆకాంక్షను గుర్తించడంలేదని మండిపడ్డారు. అమరావతి అనేది 5 కోట్ల ఆంధ్రుల ఉజ్వల భవిష్యత్తుకు ఆయువుపట్టని తేల్చిచెప్పారు.

మనసున్న వాడికే రైతు కష్టం తెలుస్తోంది: లోకేశ్

హింసించే 24వ రాజు జగన్ మాట మార్చి, మడమ తిప్పి 300 రోజులైందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. మనస్సున్న వాడికే రైతు కష్టం తెలుస్తుందని...మూర్ఖుడికి హింసించడం మాత్రమే తెలుసని ధ్వజమెత్తారు మూర్ఖుడితో సుదీర్ఘ పోరాటం చేస్తున్నందున.... ఓర్పు, సహనంతో ఉంటే అంతిమ విజయం మనదేనని ధీమా వ్యక్తం చేశారు.

జై అమరావతి ఉద్యమం మొదలై 300 రోజులైందన్న లోకేశ్... అరెస్టులు, అవమానాలు, కేసులతో రాబందుల్లా వెంటాడుతున్నా ఎత్తిన జెండా దించకుండా జై అమరావతి అని నినదించారని ప్రశంసించారు. రైతులు, మహిళలు, యువత, ఉద్యమకారులందరికీ శిరస్సు వంచి పాదాభివందనo చేస్తున్నట్లు ట్విట్టర్​లో పేర్కొన్నారు.

ఇదీ చదవండి:

అలుపెరుగని అమరావతి ఉద్యమానికి 300 రోజులు

Last Updated : Oct 12, 2020, 10:25 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.