తెలంగాణలోని దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా... మధ్యాహ్నం 3 గంటల వరకు 71.10 శాతం నమోదైంది. ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేశారు.
గర్భిణులు, దివ్యాంగుల కోసం ప్రత్యేక లైన్లు కేటాయించి, వీల్ ఛైర్లలో కేంద్రాల్లోకి పంపిస్తున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు... ఓటర్లు కొవిడ్ నిబంధనలు పాటించేలా పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. కరోనా బాధితులు సాయంత్రం 5 నుంచి 6 గంటల మధ్యలో పీపీఈ కిట్లతో వచ్చి ఓటువేసే అవకాశం కల్పించారు.
ఇదీ చూడండి: