కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి భేటీ అయ్యారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన 5 వేల కోట్ల రూపాయల స్థానిక సంస్థల గ్రాంటను విడుదల చేయాలని కోరినట్లు బుగ్గన వెల్లడించారు. గ్రాంటులు రాకపోవటంతో రాష్ట్ర ఖజానాపై ప్రభావం పడిందని ఈ సందర్భంగా వివరించారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, రెవెన్యూ లోటును ఇవ్వాలని నిర్మలా సీతారామన్‌కు విన్నవించినట్లు తెలిపారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నుంచి 3 వేల కోట్ల రీయంబర్స్మెంట్ రావాలని చెప్పుకొచ్చారు.
జల్‌శక్తి మంత్రి షెకావత్‌తో భేటీ...
కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌ని మంత్రి బుగ్గన కలిశారు. వాటర్గిడ్ ప్రాజెక్టులకు సాయం చేయాలని కోరారు. వ్యవసాయం, నీటిపారుదల, తాగునీటి వంటి అంశాలపై నీతి అయోగ్‌లో చర్చించినట్లు వెల్లడించారు.
రాష్ట్రంలోని పరిస్థితులపై స్పందిస్తూ... స్థానిక ఎన్నికల్లో స్వల్ప ఘర్షణలు సహజమని మంత్రి బుగ్గన పేర్కొన్నారు. ఇటువంటి ఒకటి రెండు సంఘటనలు తీసుకొని ప్రచారం చేయటం భావ్యం కాదని హితవు పలికారు.
ఇదీ చదవండి: