ETV Bharat / city

ప్రజలకిచ్చిన ప్రతిమాట నిలబెట్టుకునేలా బడ్జెట్‌ రూపకల్పన: హరీశ్‌రావు - telangana budget news

బడ్జెట్​ అందరికీ మేలు చేస్తుందని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్​రావు అన్నారు. వెంకటేశ్వరస్వామి ఆశీస్సులతో శాసన సభలో బడ్జెట్​ ప్రవేశ పెట్టబోతున్నట్లు తెలిపారు.

ప్రజలకిచ్చిన ప్రతిమాట నిలబెట్టుకునేలా బడ్జెట్‌ రూపకల్పన: హరీశ్‌రావు

author img

By

Published : Mar 18, 2021, 11:40 AM IST

మాట్లాడుతున్న హరీష్ రావ్

శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో బడ్జెట్​ ప్రవేశపెట్టుబోతున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఆర్థికమంత్రి హరీశ్​రావు పేర్కొన్నారు. బడ్జెట్​ అందరికీ మేలు చేస్తుందని భావిస్తున్నట్లు తెలిపారు. ప్రజలకిచ్చిన ప్రతిమాట నిలబెట్టుకునేలా బడ్జెట్‌ రూపకల్పన చేసినట్లు పేర్కొన్నారు. పేద, మధ్యతరగతి సంక్షేమం ప్రతిబింబించేలా ఉంటుందన్నారు.

హైదరాబాద్​ జూబ్లీహిల్స్​లోని తితిదే శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి మంత్రి హరీశ్​రావు వెళ్లారు. ఆలయ ప్రథమ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయం చాలా బాగుందని ప్రశంసించారు. తెలంగాణ ప్రజలకు స్వామి వారి ఆశీస్సులు ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.

ఇవీచూడండి: గుంటూరు, కృష్ణా జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా కల్పలత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.