ముఖ్యమంత్రి జగన్.. ఆయన బాబాయ్ వివేకానంద రెడ్డి హత్య కేసు నిర్ధరణలో విఫలమయ్యారని తెదేపా ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న విమర్శించారు. వైఎస్ వివేకా హత్యపై రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి... చంద్రబాబును బహిరంగ చర్చకు రావాలని చేసిన సవాల్‌ను స్వీకరిస్తున్నామని బుద్ధా వెంకన్న అన్నారు. వివేకానంద రెడ్డి హత్య కేసుపై చంద్రబాబుతో గానీ, లోకేశ్‌తో గానీ జగన్ చర్చకు సిద్ధమా..అని ప్రశ్నించారు. వివేకా హత్యపై తనతో చర్చకు రావాలని శ్రీకాంత్ రెడ్డికి సవాల్ విసిరారు. కేసు విచారణ తీరు చూస్తుంటే గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో జరిగిన పరిటాల రవి హత్య కేసులో మాదిరి నిందితులు ఆత్మహత్య చేసుకోవడం, ఎన్‌కౌంటర్‌కు గురికావడం వంటి పరిస్థితులే ఉన్నాయని అనుమానం వ్యక్తం చేశారు. వివేకానందరెడ్డి హత్య కేసులో ఇంటి దొంగలే ఉన్నారన్న విషయం తాజా పరిణామాలతే స్పష్టమవుతోందన్నారు.
ఇసుక పాలసీని గొప్పగా ప్రకటిస్తామని చెప్పిన సీఎం జగన్... భవన నిర్మాణదారులకు భారం పెంచేలా ఇసుక విధానం రూపొందించారని విమర్శించారు. తెలుగుదేశం హయాంలో రూ.1500 ఉండే ఇసుక ధర... నేడు 3 వేల 500 రూపాయలు చేరిందన్నారు.
ఇదీ చదవండి: