దక్షిణ కొరియా రాజధాని సియోల్ కు చెందిన 31 ఏళ్ల వ్యక్తికి.. ఓ గర్ల్ ఫ్రెండ్ ఉంది.. ఇది నేచురలే. వారిద్దరూ డబ్బు విషయంలో అప్పుడప్పుడూ గొడవ పడేవారు. ఇది కూడా నేచురలే. ఇలాంటి పరిస్థితుల్లో ఓ రోజు గర్ల్ ఫ్రెండ్ ఇంటికి వెళ్లాడు ఆ వ్యక్తి.. ఎవ్వరూ చేయకూడని.. చేయలేని.. "అన్ నేచురల్" పని చేశాడు. ఆ సమయంలో ఇద్దరి మధ్యన.. మళ్లీ డబ్బుల పంచాయితీ మొదలైంది. "నువ్వు అప్పులు ఎక్కువగా చేస్తున్నావ్" అని ఇతను.. "నువ్వే ఎక్కువగా ఖర్చు చేస్తున్నావ్" అని ఆమె.. ఇలా పంచాయితీ కొనసాగుతోంది. చూస్తుండగానే.. గొడవ శృతి మించింది. సహనం కోల్పోయిన అతగాడు.. గర్ల్ ఫ్రెండ్ బెడ్ రూమ్ లోకి వెళ్లి.. అక్కడున్న హ్యాండ్ బ్యాగుల్లో ఒకదాన్ని తీసుకొని.. తన ప్రియురాలి ఎదురుగానే.. అందులో గలీజు పని చేశాడు. తీవ్రంగా హర్ట్ అయిన యువతి.. అతనికి కటీఫ్ చెప్పేసింది. అంతటితో వదల్లేదు. వెంటనే పోలీస్ స్టేషన్ కు వెళ్లి.. కంప్లైంట్ చేసింది.
కేసు నమోదు చేసిన పోలీసులు.. రంగంలోకి దిగారు. నిందితుడైన ఆమె ప్రియుడిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. ఎందుకలా చేశావని ఇంటరాగేట్ చేశారు. బెంబేలెత్తిపోయిన నిందితుడు.. "అబ్బెబ్బే.. నేనలా చేయలేదండీ.. ఒట్టు నన్ను నమ్మండి.. అలా చేసినట్టు.. ఉత్తిత్తిగా బెదిరించానంతే.." అన్నాడు. దీనికి పోలీసులు.. "అవునా? ఉత్తిత్తిగానో.. నిజంగానో మేం తేలుస్తాం కదా!" అని ఆ బ్యాగును ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు.
వన్ "బ్యాడ్ డే".. అతని జాతకం బయటకు వచ్చింది. అతని గర్ల్ ఫ్రెండ్ చెప్పిందే నిజమని, ఆమె హ్యాండ్ బ్యాగులో.. పెంట పని చేసింది నిజమేనని రిపోర్టులో తేలింది. అంతేకాదు.. చేసిన గబ్బు పనిని చెరిపేసేందుకు.. ఆ హ్యాండ్‌బ్యాగ్‌లో.. లిక్విడ్ డియోడరెంట్‌ను పోసినట్టు కూడా ఆధారాలు కనిపించాయి. అయినప్పటికీ ఆ ఛండాలం పూర్తిగా తొలగిపోలేదు. అందులోని ఆధారాలు.. నిందితుడి DNAతో సరిగ్గా మ్యాచ్ అయ్యాయి. ఇంకేముంది..? ఖేల్ ఖతం.. దుక్నం బంద్.
నిందితుడిని కోర్టులో ప్రవేశ పెట్టారు.. అతగాడిని చూసిన జడ్జి.. "ఏందిరయ్యా.. బ్యాగులో ఏం చేశావ్..?" అని ప్రశ్నించారు. "మెమ్మెమ్మే.. బెబ్బెబ్బే.." అన్నాడు నిందితుడు. సాక్ష్యాధారాలను పరిశీలించిన న్యాయమూర్తి.. నిందితుడిని దోషిగా తేల్చారు. చేసిన తప్పుకు శిక్షగా.. 15 లక్షల (కొరియన్) రూపాయలు చెల్లించాలని ఆదేశించారు. ఇది కూడా.. నిందితుడి మొదటి నేరం కాబట్టే.. ఇంత తక్కువ శిక్షతో వదిలేస్తున్నట్టు జడ్జి చెప్పారు. అదన్నమాట ఈ కేసు సంగతి. అతి ఆవేశానికి లోనై.. ఏకంగా 15 లక్షలు సమర్పించుకున్నాడమన్న మాట..! అందుకే.. పెద్దలు ఏమంటారంటే.. తనకోపమే..
"ఇంక చాలు ఆపేసెయ్.. ఇందాకట్నుంచి టెన్షన్ తట్టుకోలేకపోతున్నాం.. ముందు అతగాడు బ్యాగులో చేసిన ఆ గబ్బు పనేంటో చెప్పేసెయ్.. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడో తెలియనప్పుడు కూడా ఇంత టెన్షన్ పడలేదు" అంటున్నారా? ఓకే.. ఓకే.. చెప్పేస్తున్నా. గర్ల్ ఫ్రెండ్ బ్యాగులో.. ఆ బాయ్ ఫ్రెండ్ చేసిన గలీజు పని ఏమంటే.. సుస్సు పోశాడు!!
వీటిపై ఓ క్లిక్కేయండి..
- అక్కడ రాళ్లు నడుస్తాయి.. పరిగెడతాయి..!!
- మనుషులకు తోకలు మొలుస్తున్నాయ్.. ఇట్స్ ట్రూ యార్..!
- ఫైవ్ స్టార్ హోటల్లో పందుల పెంపకం.. ఇదేందయ్యా ఇదీ..!?
- "యువరానర్.. దిసీజ్ వెరీ దారుణం.. ఈ కోడి పుంజును శిక్షించండి".. కోర్టుకెళ్లిన దంపతులు!!
- అక్కడ ఉద్యోగులు తప్పుచేస్తే.. పచ్చి కోడిగుడ్లు, బొద్దింకలు మింగాలి!!
- ఇదేం వింత సామీ.. ఆక్సిజన్ లేకుండానే బతికేస్తోంది..!!
- "మిమ్మల్ని నా బంగారం అనుకున్నా.. ఛీ పోండ్రా.." రాజీనామా చేసిన యువతి..