ETV Bharat / city

'శంకుస్థాపన చేసిన తర్వాత మూడున్నరేళ్లు ఏం చేశారు' - botsa satyanarayana comments on Farmers Agitation

అమరావతి విషయంలో తెదేపా రాజకీయాలు చేస్తోందని మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు. శంకుస్థాపన చేసిన తర్వాత మూడున్నరేళ్లు చంద్రబాబు ఏం చేశారని బొత్స ప్రశ్నించారు. ప్రతీ అంశంపైనా కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకోవడం అలవాటుగా మారిందని ధ్వజమెత్తారు. చంద్రబాబు సహా ఆయన బంధువులు, అనుచరులు అమరావతిలో భూ అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. 29 గ్రామాలను అభివృద్ధి చేసి ఇస్తామని మంత్రి బొత్స స్పష్టం చేశారు.

botsa satyanarayana controversial comments on chandrababu
మంత్రి బొత్స సత్యనారాయణ
author img

By

Published : Oct 22, 2020, 7:36 PM IST

మంత్రి బొత్స సత్యనారాయణ

రాజధాని నిర్మాణం కోసం శంకుస్థాపన చేపట్టి ఐదేళ్లు అయ్యిందని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. దీనిపై తెలుగుదేశం పార్టీ పాదయాత్ర చేపట్టి రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. శంకుస్థాపన చేసిన తర్వాత మూడున్నరేళ్లు చంద్రబాబు ఏం చేశారని బొత్స ప్రశ్నించారు. కనీసం రాజధానికి వెళ్లే కరకట్ట మార్గం కూడా నిర్మించలేకపోయారని విమర్శించారు. తాత్కాలిక భవనాలకు చదరపు అడుగుకు వేల రూపాయల వ్యయంతో నిర్మాణాలు చేపట్టారని ఆరోపించారు.

అదే చంద్రబాబు బాధ..

ఇన్​సైడర్ ట్రేడింగ్ లాభాలు తగ్గిపోయాయని చంద్రబాబు బాధపడుతున్నారని మంత్రి బొత్స ఎద్దేవా చేశారు. కనీసం 5 శాతం పని చేయకుండా రాజధాని పూర్తి అయిపోవచ్చిందని ఎలా చెబుతారని నిలదీశారు. వైకాపాకు ఇదే ఆఖరు ఛాన్స్ అని అల్టిమేటం ఇస్తున్న చంద్రబాబు.. తన పార్టీ గురించి చూసుకోవాలని హితవు పలికారు. రాజధాని నిర్మాణం కోసం చేసిన ఖర్చులో కన్సల్టెంట్స్ కోసమే రూ.800 కోట్లు ఖర్చు అయ్యిందని, కమ్యూనిస్టులు కూడా ఇప్పుడు రాజధానిలో పేదలకు ఇళ్లు ఇస్తామనంటే ఎందుకు వ్యతిరేకిస్తున్నారని ప్రశ్నించారు.

స్టే తెచ్చుకోవడం అలవాటుగా మారింది..

రాష్ట్రంలో ప్రతీ అంశంపైనా కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకోవడం అలవాటుగా మారిందని బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. కనీసం అమరావతి ఆలయం ఉన్న ప్రాంతాన్నీ అభివృద్ధి చేయలేదన్నారు. అమరావతి నిర్మాణం పేరిట ఐదేళ్ల పాటు చంద్రబాబు గ్రాఫిక్స్ మాత్రమే చూపించారని.. ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉండి హైదరాబాద్​లో సొంత ఇల్లు మాత్రం కట్టుకున్నారని ధ్వజమెత్తారు. మంత్రిగా తనకు గుర్తులేనన్నీ కార్యక్రమాలు వైకాపా ప్రభుత్వం ప్రారంభించిందని బొత్స పేర్కొన్నారు. 23 సంక్షేమ పథకాలు రాష్ట్రంలో నవరత్నాలుగా అమలు అవుతున్నాయని వివరించారు.

ఆ బకాయిలు తీరుస్తున్నాం..

గత ప్రభుత్వ హయాంలో ఇవ్వాల్సిన బకాయిలు అన్ని.. తమ ప్రభుత్వం వచ్చాక తీరుస్తుందని మంత్రి బొత్స పేర్కొన్నారు. ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు.. ఆయన స్థాయిని తగ్గించుకునే మాటలు ఇకనైనా మానుకోవాలని హితవు పలికారు. అమరావతిలో భూ దోపిడీ జరుగుతోందని తాము ముందుగానే హెచ్చరించామని.. తప్పులు జరిగాయని చెబితే తెదేపా నేతలు సవాళ్లు విసిరారని, తప్పు చేయకపోతే కోర్టులకు వెళ్లి ఎందుకు స్టేలు ఎందుకు తెచ్చుకున్నారని బొత్స నిలదీశారు.

భూ అక్రమాలకు పాల్పడ్డారు..

చంద్రబాబు సహా ఆయన బంధువులు, అనుచరులు అమరావతిలో భూ అక్రమాలకు పాల్పడ్డారని.. మంత్రిగా అధికారికంగా చెబుతున్నానని బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. ఇది తన వ్యక్తిగత ఆరోపణ కాదని తేల్చి చెప్పారు. పరిపాలన వికేంద్రీకరణే తమ విధానమని, అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చేస్తామన్నారు. అమరావతి కూడా రాష్ట్రంలో భాగమేనని, అందుకే తాడేపల్లి, మంగళగిరి ప్రాంతాలు అభివృద్ధి చేస్తూ.. ఈ ప్రాంతాన్ని కార్పోరేషన్​గా మార్చబోతున్నామని స్పష్టం చేశారు.

అభివృద్ధి చేసి ఇస్తాం..

29 గ్రామాలను అభివృద్ధి చేసి ఇస్తామని మంత్రి బొత్స స్పష్టం చేశారు. గతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలు పూర్తి చేస్తామన్నారు. ప్లాట్లు ఇవ్వబోతున్నామని ఉద్ఘాటించారు. శాసన రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేస్తామని ప్రకటించామని.. అలాగే అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఎస్ఈసీ నిధులను ప్రభుత్వాన్ని అడగాలని.. కోర్టులను కాదని బొత్స వ్యాఖ్యానించారు. అదనంగా కావాలంటే పంచాయతీరాజ్, పురపాలక శాఖలు నిధులు మంజూరు చేస్తాయని చెప్పారు. నిమ్మగడ్డ రమేశ్​కుమార్ తమపై అధికార దర్పాన్ని చేలాయించాలని చూస్తే ఎలాని అన్నారు.

ఇదీ చదవండీ... ప్రజల ఆకాంక్షలు నీరుగార్చడం ప్రజాద్రోహం : చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.