ETV Bharat / city

పుట్టిన పిల్లలందరినీ ఎండలో ఉంచుతున్నారు.. అనాదిగా వస్తోన్న ఆచారమంటా..!

సూర్యుని లేలేత కిరణాలకు మానవ జీవితానికి విడదీయలేని అనుబంధం ఉంది. నిత్యం ఉదయం సూర్య నమస్కారాలు చేయడంలోనూ శాస్త్రీయత దాగి ఉంది. వేకువన మనపై ప్రసరించే లేలేత సూర్యకిరణాలు మన ముఖవర్చస్సును మరింత ఇనుమడింపజేస్తుంది. ఆసుపత్రి ప్రాంగణాల్లోకి అడుగుపెడితే చాలు పదుల సంఖ్యలో చిన్నారులను తమ ఒడిలో తీసుకొని సూర్యకిరణాల కోసం ఎదురు చూస్తున్న మహిళలు కనిపిస్తారు. చిన్నారుల శరీరానికి వెచ్చటి సూర్యరశ్మి తాకాలన్న తపన వారిలో కనిపిస్తుంది. చిన్నారులు వివిధ వ్యాధుల బారిన పడకుండా ఇదే సరైన మార్గంగా వైద్యనిపుణులు చెబుతున్నారు.

author img

By

Published : Nov 19, 2021, 7:31 AM IST

born-babies-are-exposed-in-sunrays-for-vitamin-d-at-karimnagar-hospital
పుట్టిన పిల్లలందరినీ ఎండలో ఉంచుతున్నారు.. అనాదిగా వస్తోన్న ఆచారమంటా..!
పుట్టిన పిల్లలందరినీ ఎండలో ఉంచుతున్నారు.. అనాదిగా వస్తోన్న ఆచారమంటా..!

తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్​ కిట్‌ ప్రవేశపెట్టడంతో సర్కార్ దవాఖానాల్లో ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరిగింది. కరోనా విపత్తు తర్వాత ప్రజల్లో ఆరోగ్య స్పృహపైనా అవగాహన అధికమైంది. కరీంనగర్‌లోని మాతాశిశుకేంద్రం ప్రాంగణంలోకి అడుగుపెడితే చాలు..పసికందుల కేరింతలు ఏడ్పులు..నవ్వులు వినిపిస్తుంటాయి. ఉదయం 6 గంటల నుంచే సూర్యుడు ఎప్పుడెప్పుడు బయటికి తొంగి చూస్తాడా అని ఆశగా ఎదురుచూస్తుంటారు. చిన్నారుల్లో విటమిన్‌ డి3 కోసం ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేకుండా ఆ సూర్య భగవానుడు ఉచితంగా ప్రసాదించే లేలేత కిరణాల తాకేలా ఎండకు ఉంటారు. చిన్నారుల శరీరానికి వెచ్చటి సూర్యరశ్మి తాకాలన్న తపన వారిలో కనిపిస్తుంది. చిన్నారులు పచ్చకామెర్ల వ్యాధి బారిన పడకుండా ఇదే సరైన మార్గంగా చెబుతున్నారు.

అనాదిగా వస్తోన్న ఆచారం..

ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచే కాకుండా అటు ఆదిలాబాద్‌, మంచిర్యాల జిల్లాల నుంచి మహిళలు ప్రసవం కోసం కరీంనగర్‌లో మాతాశిశు కేంద్రానికి వస్తుంటారు. ఇటీవల ప్రభుత్వం నుంచి నాణ్యమైన సేవలు లభించడంతో పాటు కేసీఆర్ కిట్ కారణంగా ప్రభుత్వాసుపత్రికి వచ్చే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. శిశుకేంద్రం ప్రాంగణంలో ఎక్కడ చూసినా.. తల్లి ఒడిలో వెచ్చగా నిదురపోవల్సిన చిన్నారులు లేలేత సూర్యకిరణాల్లో మెరిసిపోతుంటారు. పసికందులకు సూర్యరశ్మి తగిలితే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని చెబుతుంటారని అందువల్ల తామంతా ఇక్కడ చిన్నారులతో ఎండలో కూర్చున్నట్లు చెబుతున్నారు. అనాదిగా వస్తున్న ఈ ఆచారాన్ని కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు.

వైద్యుల సూచన..

ప్రస్తుతం మారుతున్న పరిస్థితుల్లో ఇళ్లలో సూర్యకిరణాలు పడే రోజులు పోయాయని వైద్యులు చెబుతున్నారు.ఈ కారణంగా మహిళలు అనేక రుగ్మతలను ఎదుర్కొవల్సిన పరిస్థితి ఏర్పడుతోందని వివరిస్తున్నారు. అనాదిగా చెబుతున్నట్లు చిన్నారులకు సూర్యరశ్మి తాకేలా చర్యలు తీసుకోవాలన్న అంశం తాము కూడా సూచిస్తుంటామంటున్నాకు. ప్రధానంగా చిన్నారుల్లో విటమిన్​- డీ3 లోపం కారణంగా చిన్నారులు కామెర్ల బారిన పడుతుంటారని వైద్యులు డాక్టర్ అజయ్‌కుమార్ చెప్పారు. వాస్తవానికి ఉదయం వేళల్లో సూర్యకిరణాలు పడే విధంగా కాలినడక నిర్వహించడం, జాగింగ్‌, కసరత్తులు చేస్తే ఈ లోపాన్ని అరికట్టగలుగుతామని వైద్యులు పేర్కొంటున్నారు. ఈ విషయం పట్ల అవగాహన లేకపోవడం వల్ల అనవసరంగా ఔషధాలు వినియోగించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పారు.

నిరంతరం వ్యాధులకు ఔషధాలు వినియోగించే కంటే.. ఆ వ్యాధుల బారిన పడటానికి కారణమేంటో తెలుసుకొని ముందు జాగ్రత్తలు తీసుకొంటే బాగుంటుందని వైద్యులు సూచిస్తున్నారు. విటమిన్‌- డీ3 లోపం వల్ల ఎదురయ్యే రుగ్మతలను అధిగమించాలంటే లేలేత సూర్యకిరణాలే దివ్యౌషధమని వైద్యులు ఘంటాపథంగా చెబుతున్నారు.

ఇదీ చూడండి:

Rains: జలదిగ్భంధంలో చిత్తూరు జిల్లా..స్తంభించిన జన జీవనం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.