Boora joining in BJP update: ఈనెల 20 లేదా 21 న దిల్లీలో భాజపా జాతీయ అధ్యక్షుడు నడ్డా సమక్షంలో తెరాస మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ భాాజపాలో చేరనున్నారు. భాజపా రాష్ట్ర ఇంఛార్జ్ తరుణ్ చుగ్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఇతర ముఖ్య నేతలు ఈనెల 19న నర్సయ్యగౌడ్ ఇంటికి వెళ్లి సమావేశం కానున్నారు. తరువాత హస్తినకు వెళ్లి పార్టీ హైకమాండ్ పెద్దల సమక్షంలో ఈనెల 20 లేదా 21న భాజపాలో చేరనున్నారు.
ఈ నెలాఖరున 27 లేదా 28న హైదరాబాద్ శివారులో భాజపా బీసీ ఆత్మ గౌరవ సభ నిర్వహించనుంది. ఆ సభలో బూర నర్సయ్య వర్గీయులు కమలం పార్టీలో చేరనున్నారు. ఆ సభకు పార్టీ ముఖ్య నేత హాజరయ్యే అవకాశం ఉంది. ఆదివారం తెరాసకు రాజీనామా చేసిన బూరనర్సయ్య గౌడ్... అందుకు గల కారణాలపై మఖ్యమంత్రి కేసీఆర్కు లేఖ రాశారు.
తాను తెరాస నుంచి వెళ్లలేదని.. ముఖ్యమంత్రి కేసీఆరే వద్దనుకుని అవమానించి పార్టీ నుంచి పంపించారేమోనని బూర నర్సయ్య గౌడ్ లేఖలో ఆరోపించారు. ప్రజా సమస్యలు చెప్పుకునేందుకు ముఖ్యమంత్రిని కలిసేందుకు అవకాశం లేకపోతే.. పార్టీలో ఉండటం వృథా అని రాజీనామా చేసినట్లు తెలిపారు. అభిమానానికి.. బానిసత్వానికి తేడా ఉంటుందన్న ఆయన.. రాజకీయ వెట్టిచాకిరీని తెలంగాణ ప్రజలు ఎక్కువ కాలం భరించలేరని లేఖలో పేర్కొన్నారు.
వచ్చే ఎన్నికల్లో భువనగిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్ధిగా బూర నర్సయ్య పోటీ చేస్తారని... ఈ మేరకు భాజపా అధిష్ఠానం నుంచి హామీ లభించినట్లు ఆయన వర్గీయులు చెబుతున్నారు. తెరాస మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ అంశంపైనా కూడా తెరాసలో చర్చ జరుగుతోంది.
ఇవీ చదవండి: