మాచర్ల ఘటనపై కాల్ డేటా ఆధారంగా చర్యలు తీసుకోవాలని.. తెదేపా నేత బొండా ఉమ డిమాండ్ చేశారు. వైకాపా నాయకుల దౌర్జన్యాలపై వీడియోలతో సహా సాక్ష్యాలు సేకరించామన్నారు. తమపై దాడి చేయించిన పిన్నెల్లి, వెంకట్రామిరెడ్డి పేర్లు లేకపోవటం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనతో సంబంధం ఉన్న వ్యక్తులను వదిలి అనామకులపై కేసులు పెట్టి తమని రావాలని పిలుస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. గుంటూరు పోలీసులపై తమకు నమ్మకం లేదన్నారు. హత్యాయత్నం జరిగితే పోలీసులు పట్టించుకోకపోవడం దారుణమని బొండా ఉమ ఆగ్రహం వక్తం చేశారు.
ఇదీ చదవండి : అమరావతికి మద్దతుగా ప్రకటన వచ్చే వరకు పోరు ఆగదు !