నాగార్జునసాగర్ జలాశయంలో నేటి నుంచి పర్యాటకుల కోసం లాంచీలను నడిపేందుకు పర్యటక శాఖ అనుమతులిచ్చినట్లు లాంచీ మేనేజర్ హరి తెలిపారు. కరోనా నేపథ్యంలో మార్చి నుంచి లాంచీ ప్రయాణాన్ని నిలిపి వేశారు. నేటి నుంచి 120 మంది సామర్థ్యం ఉన్న లాంచీని కేవలం జాలీ ట్రిప్పులను మాత్రమే నడుపుతున్నారు.
జాలీ ట్రిప్పులకు వెళ్లే పర్యటకులకు టిక్కెట్ ధరలు పెద్దలు అయితే రూ.100, పిల్లలకు అయితే రూ.70 గా నిర్ణయించారు. లాంచీ ప్రయాణంలో కరోనా వైరస్ ప్రబలకుండా శానిటైజరు చేస్తూ... సామాజిక దూరం పాటిస్తున్నారు. ప్రతి ట్రిప్పునకు 60 మంది పర్యాటకులను అనుమతిస్తున్నట్లు హరి తెలిపారు.
ఇదీ చూడండి:
'మా పార్టీకి సిద్ధాంతాలున్నాయి.. ఎమ్మెల్యేలు రాజీనామా చేసి రావాల్సిందే'