ETV Bharat / city

బ్లాక్ డే: నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఆందోళనలు - ఏపీ వార్తలు

నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్తంగా రైతుసంఘాలు, ప్రజాసంఘాలు, పలు పార్టీలు ఆందోళన నిర్వహించాయి. సంయుక్త కిసాన్ మోర్చా ఇచ్చిన పిలుపు మేరకు ఈ నిరసనలు చేపట్టాయి. సాగు చట్టాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశాయి.

block day in ap
block day in ap
author img

By

Published : May 26, 2021, 4:29 PM IST

కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ సీఐటీయూ, రైతు సంఘాలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లా పాలకొండ ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో ధర్నా నిర్వహించారు. సంయుక్త కిసాన్ మోర్చా ఇచ్చిన పిలుపు మేరకు ఈ ఆందోళనలు చేపట్టారు. 6 నెలలుగా రైతులు ఆందోళనలు చేస్తున్నప్పటికీ.. కేంద్రం చలించట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కేంద్రం దిగివచ్చి రైతు ఉద్యమాన్ని గౌరవించి వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

విశాఖ జిల్లాలో..

రైతు వ్యతిరేక చట్టాలను కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి వజిపర్తి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ విశాఖ పార్టీ కార్యాలయంలో నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి శివకుమార్, కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ జాతీయ కార్యదర్శి గంగాధర్, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి సుధాకర్, వాసుదేవరావు, బీసీ సెల్ కార్యదర్శి జగన్, ఎండి భాషా, కస్తూరి వెంకట్రావు, అప్పారావు తదితరులు పాల్గొన్నారు

గుంటూరు జిల్లాలో..

జిల్లావ్యాప్తంగా బ్లాక్ డే ఆందోళనలు నిర్వహించారు. ఆర్నెళ్లుగా అన్నదాతలు ఉద్యమం చేస్తున్నా.. కేంద్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని సీపీఎం ప్రధాన కార్యదర్శి పాశం రామరావు అన్నారు. కరోనా కట్టడిలోనూ కేంద్రం విఫలమైందన్నారు. నూతన సాగు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

మంగళగిరి, తాడేపల్లి, తుళ్లూరులో తహసీల్దార్ కార్యాలయాల వద్ద రైతులు, వ్యవసాయ కార్మిక సంఘాల నేతలు నల్ల జెండాలతో నిరసనలు తెలిపారు.

ప్రకాశం జిల్లాలో...

చీరాల ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ కార్యాలయంలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో బ్లాక్ డే నిర్వహించారు. కేంద్రం రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను పాటిస్తుందని నాయకులు విమర్శించారు. ఆరు నెలలుగా రైతులు ఉద్యమం చేస్తున్నా కేంద్రం పట్టించుకోకపోవడం దారుణమన్నారు.

కృష్ణా జిల్లాలో..

సంయుక్త కిసాన్ పిలుపు మేరకు జిల్లా వ్యాప్తంగా బ్లాక్ డే నిర్వహించారు. నూతన సాగు చట్టాలను రద్దు చేయాలని, పెట్రో ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. ఉయ్యూరులో మోటారు సైకిళ్ల ర్యాలీ నిర్వహించిన అనంతరం కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను తగలబెట్టారు. వడ్డే శోభనాద్రీశ్వర రావుతో పాటు పలు గ్రామాల రైతులు, కార్మికులు పాల్గొన్నారు.

విజయవాడ నందిగామ గాంధీ సెంటర్​లో ఆందోళనలు చేపట్టారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

కడపలో...

నూతన సాగు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ.. కడపలో పలు కార్మిక సంఘాలు, ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో నల్లజెండాలతో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఆరు నెలలుగా ఉద్యమం చేస్తున్నా కేంద్రం స్పందించకపోవడం దారుణమన్నారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే వ్యవసాయ వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని, లేదంటే ఉద్యమాలను మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

స్థానిక తహసీల్దార్ కార్యలయం వద్ద వామపక్ష నాయకులు ఆందోళన నిర్వహించారు. కేంద్రం అన్ని రంగాల్లో విఫలమైందని సీపీఐ ఏరియా కార్యదర్శి శ్రీరాములు విమర్శించారు. ఆరు నెలల నుంచి రైతులు పోరాటం చేస్తుంటే కేంద్రం పట్టించుకోకపోవడం దారుణమన్నారు.

పశ్చిమగోదావరి జిల్లాలో...

ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో బ్లాక్ డే నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. పవర్ పేటలోని అన్నే వెంకటేశ్వరరావు భవనం వద్ద నల్ల జెండాలతో ఆందోళన చేపట్టారు. రైతు వ్యతిరేక సాగు చట్టాలు రద్దు చేయాలని, కార్మికులకు నష్టం కలిగించే కార్మిక కోడ్​లను రద్దు చేయాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్​టీయూ, సీఐటీయూ, ఏఐటీయూసీ , రైతు సంఘం వ్యవసాయ కార్మిక సంఘం, బికేఎంయూ, చేతి వృత్తిదారుల సమన్వయ కమిటీ, దళిత సంఘాలు, వివిధ ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.

తణుకులో ఏఐటీయూసీ, సిఐటియు, సీపీఎం, సీపీఐ ఆధ్వర్యంలో నల్ల జెండాలు, నల్ల బ్యాడ్జీలతో నిరసన ప్రదర్శన నిర్వహించి, ప్రధాని దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.

నెల్లూరు జిల్లాలో..

కేంద్రం తీసుకొచ్చిన మూడు సాగు చట్టాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ.. రైతు సంఘాల నాయకులు, ప్రజాసంఘాలు ఆందోళన నిర్వహించాయి. నాయకులు.. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నల్లజెండాలతో నిరసన వ్యక్తం చేశారు.

కర్నూలు జిల్లాలో..

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కర్నూలులో కార్మిక, కర్షక సంఘాల ఆధ్వర్యంలో బ్లాక్ డే నిర్వహించారు. వ్యవసాయ మార్కెట్​లను కొనసాగించాలని ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చెయ్యగా.. కిసాన్ మోర్చా కమిటీ ఆధ్వర్యంలో వన్ టౌన్​లో రహదారిపై బైఠాయించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఇదీ చదవండి: కరోనా కట్టడిలో ప్రభుత్వానికి సహకరించాలి: జవహర్ రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.