ETV Bharat / city

తెలంగాణ: జీహెచ్​ఎంసీ మేయర్​ పోటీకి సై అంటున్న భాజపా - తెలంగాణ ముఖ్యాంశాలు

గ్రేటర్​ హైదరాబాద్​ మేయర్​ ఎన్నికకు పోటీ చేస్తామని భాజపా ప్రకటించింది. గురువారం జరగబోయే మేయర్​ ఎన్నిక సందర్భంగా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో కార్పొరేటర్లతో సీనియర్​ నేతలు సమావేశమయ్యారు.

జీహెచ్​ఎంసీ మేయర్​ పోటీకి సై అంటున్న భాజపా

author img

By

Published : Feb 10, 2021, 2:00 PM IST

ఈ నెల 11న జరగబోయే జీహెచ్‌ఎంసీ మేయర్‌ ఎన్నికల్లో పోటీ చేస్తామని భాజపా ప్రకటించింది. భాజపా రాష్ట్ర కార్యాలయంలో పార్టీ నూతన కార్పొరేటర్లతో సీనియర్​ నేతలు సమావేశం నిర్వహించారు. మేయర్‌ ఎన్నికకు అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు.

గురువారం ఉదయం పాతబస్తీ భాగ్యలక్ష్మీ అమ్మవారి దర్శనం అనంతరం నేరుగా మేయర్‌ ఎన్నికకు వెళ్లాలని పార్టీ సీనియర్​ నాయకులు సూచించారు. ఎన్నిక రోజు పరిస్థితులకు అనుగుణంగా రాష్ట్ర నాయకత్వం మార్గనిర్దేశం చేస్తుందని తెలిపారు.

ఇదీ చదవండి: మీడియాతో మాట్లాడేందుకు మంత్రి పెద్దిరెడ్డికి హైకోర్టు అనుమతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.