ETV Bharat / city

Bandi sanjay : 'తెలంగాణ ప్రజల కోసం తల నరక్కోవడానికి సిద్ధం' - bjp telangana bandi sanjay fires on cm kcr

మూడు ఎకరాలు ఇవ్వని.. అంబేడ్కర్​ విగ్రహం పెట్టని ముఖ్యమంత్రి దళితులకు క్షమాపణ చెప్పాలని భాజపా తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్​ చేశారు. కేసీఆర్​ ప్రెస్​మీట్​లో తనపై చేసిన వ్యాఖ్యలపై సంజయ్​ స్పందించారు. తెలంగాణ ప్రజల కోసం తన తల నరుక్కోవడానికి సిద్ధంగా ఉన్నానన్నారు.

బండి సంజయ్
బండి సంజయ్
author img

By

Published : Nov 9, 2021, 6:04 PM IST

తెలంగాణ వ్యాప్తంగా ప్రతి ఒక్క దళితునికి 10 లక్షల రూపాయలు ఇవ్వాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ డిమాండ్​ చేశారు. ప్రతిఒక్కరికీ దళిత బంధు వచ్చేలా తెరాసలో ఉన్న దళిత ప్రజాప్రతినిధులు కృషిచేయాలని సూచించారు. ఎస్సీలు ఓట్లేస్తేనే కేసీఆర్​ సీఎం అయ్యారన్నారు. మూడెకరాలు ఇస్తానని, అంబేడ్కర్​ విగ్రహం పెడతానని మోసం చేశారని బండి సంజయ్​ ఆరోపించారు. దళితుడిని సీఎం చేయాల్సిందేనని డిమాండ్​ చేశారు. తన గురువు ఎవరని సీఎం అడిగారని.. కేసీఆరే తన గురువని చెప్పారు.

ఏడేళ్లలో ధాన్యం ఎవరు కొన్నారో చెప్పాలని బండి సంజయ్​ డిమాండ్​ చేశారు. రాష్ట్రంలో రైతులు ఇబ్బందులు పడుతున్నారని సంజయ్​ ఆందోళన వ్యక్తం చేశారు. కొనుగోళ్లు కేంద్రాల వద్ద అన్నదాతలు అవస్థలు పడుతున్నారన్నారు. వెంటనే వారికి న్యాయం చేయాలని డిమాండ్​ చేశారు.

తాను పేదల కోసం కొట్లాడుతున్నానని సంజయ్​ చెప్పారు. కేసీఆర్​ తాటాకు చప్పుళ్లకు తాను భయపడనని స్పష్టం చేశారు. కేసీఆర్​ తనను ఎన్ని తిట్టిన భయపడనన్నారు. తెలంగాణ ప్రజల కోసం తన తల నరుక్కోవడానికి సిద్ధమన్నారు. తాము త్యాగాలను వెనకాడనన్నారు.

ప్రతి ఎస్సీ కుటుంబానికి దళిత బంధు కింద 10 లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ... భాజపా డప్పుల మోత కార్యక్రమం చేపట్టింది. బాబూ జగ్జీవన్‌రామ్‌ విగ్రహానికి నివాళులర్పించిన నేతలు... అనంతరం ర్యాలీ ప్రారంభించారు. భాజపా ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియం నుంచి డప్పులమోత కార్యక్రమం నిర్వహించారు. ఎల్బీ స్టేడియం నుంచి ట్యాంక్‌బండ్‌ వరకు భాజపా నేతలు, కార్యకర్తలు డప్పులతో ర్యాలీ చేశారు. రాష్ట్రమంతా దళితబంధు అమలు చేయాలంటూ నినాదాలు చేశారు. నిరసన కార్యక్రమంలో భాజపా రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్‌ తరుణ్‌ చుగ్‌, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్​, రాజాసింగ్, విజయశాంతి పాల్గొన్నారు.

ఇవీచదవండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.