పీజీ వైద్య విద్య ప్రవేశాల్లో నెలకొన్న ప్రతిష్టంభన.. విద్యార్థులను గందరగోళానికి గురి చేస్తోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్కు ఆయన లేఖ రాశారు. ప్రభుత్వం కౌన్సెలింగ్ నిర్వహించి సీటు కేటాయించినా.. వైద్య, దంత వైద్య కళాశాలలు విద్యార్థులను చేర్చుకోవడం లేదని కన్నా లేఖలో పేర్కొన్నారు.
దీని వల్ల విద్యార్థులు గందరగోళానికి గురవుతున్నారని కన్నా లేఖలో తెలిపారు. ప్రభుత్వం వెంటనే ఆయా కళాశాలలతో సంప్రదింపులు జరిపి సమస్య పరిష్కరించాలని కన్నా డిమాండ్ చేశారు. సమస్యను పరిష్కరించడంలో ఏ మాత్రం జాప్యం జరిగినా విద్యార్థులు నష్టపోతారని పేర్కొన్నారు.
ఇదీ చూడండి..