ETV Bharat / city

ఈ ఏడాదిలో ఏపీకి రూ.45 వేల కోట్లు వస్తాయ్​..!: రాంమాధవ్​

కేంద్ర ప్రభుత్వం ద్వారా రాష్ట్రానికి ఈ ఏడాదికి రూ.45 వేల కోట్లు వస్తాయని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్​ తెలిపారు. భాజపా ఏడాది పాలనకు గుర్తుగా నిర్వహించిన వర్చువల్​ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. దేశాభివృద్ధే లక్ష్యంగా ప్రతి పథకం, కార్యక్రమం తెచ్చామని వెల్లడించారు. వైకాపా ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో పాలన రివర్స్​ అవుతుందని ఎద్దేవా చేశారు.

ఈ ఏడాదిలో ఏపీకి రూ.45 వేల కోట్లు వస్తాయ్​..!: రాంమాధవ్​
ఈ ఏడాదిలో ఏపీకి రూ.45 వేల కోట్లు వస్తాయ్​..!: రాంమాధవ్​
author img

By

Published : Jun 10, 2020, 9:17 PM IST

కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అన్నిరకాలుగా సాయం చేస్తుందని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్​ అన్నారు. హైదరాబాద్​లో మోదీ ఏడాది పాలనపై భాజపా ఆధ్వర్యంలో నిర్వహించిన వర్చువల్ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, ఇతర నేతలు పాల్గొన్నారు. కరోనా వల్ల ఏపీకి రూ.35 వేల కోట్లు ఇస్తామని కేంద్రం హామీ ఇచ్చిందని.. ఇప్పటికే రూ.10 వేల కోట్లు ఇచ్చినట్లు రాంమాధవ్​ స్పష్టం చేశారు. ఈ ఏడాది ఏపీకి రూ.45 వేల కోట్లు వస్తున్నాయని అన్నారు. కేంద్రం లక్షా 34 వేల టన్నుల ఆహారధాన్యాలు రాష్ట్రానికి ఇచ్చిందని వెల్లడించారు.

పాలనకు గుర్తుగా..

ఏడాది భాజపా పాలనకు గుర్తుగా వర్చువల్ ర్యాలీలు చేపట్టామని రాంమాధవ్‌ వివరించారు. కేంద్రప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తామని చెప్పారు. కరోనా వ్యాప్తి వల్ల ప్రజల వద్దకు వెళ్లలేకపోతున్నామన్న ఆయన.. దేశాభివృద్ధే లక్ష్యంగా ప్రతి పథకం, కార్యక్రమం తెచ్చామని వెల్లడించారు. భాజపా శ్రేణులంతా కరోనా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

అన్నీ రివర్స్​..

ప్రస్తుతం ఏపీలో అంతా రివర్స్​ అవుతుందని రాంమాధవ్​ ఎద్దేవా చేశారు. పోలవరం, మద్యపానం, తిరుమల భూములు అన్నింటిలోనూ ప్రభుత్వం రివర్స్​ అడుగులు వేసిందని విమర్శించారు. వైకాపా ప్రభుత్వ పాలనలో ఆదాయం బాగా తగ్గిందన్న ఆయన.. అధికారం చేపట్టిన ఏడాది కాలంలో హైకోర్టుతో 60 మొట్టికాయలు వేయించుకుందని పేర్కొన్నారు. ప్రత్యామ్నాయం లేక ప్రజలు వైకాపాకు అధికారం కట్టబెట్టారని రాంమాధవ్​ అన్నారు.

ప్రజా సంక్షేమమే లక్ష్యం

ప్రజా సంక్షేమం, పారిశ్రామికీకరణ, దేశభద్రత భాజపా ప్రధాన లక్ష్యాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. దేశంలో అనేక సంక్షేమ పథకాలు తెచ్చిన ఘనత భాజపాదేనని కొనియాడారు. పేదల ఆరోగ్య కోసం ఆయుష్మాన్​ భారత్​ తీసుకువచ్చామన్న ఆయన.. వర్చువల్‌ ర్యాలీల ద్వారా ప్రజలకు మరిన్ని విషయాలు చేరవేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

ఇదీ చూడండి..

'ప్రభుత్వం అధికారంలో కొనసాగే నైతిక హక్కు కోల్పోయింది'

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.