బద్వేలు ఉపఎన్నికపై.. భాజపా ఎంపీ జీవీఎల్, ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ సునీల్ ధియోదర్ ఆరోపణలు చేశారు. వైకాపా రిగ్గింగ్‌కు పాల్పడిందని ఎంపీ జీవీఎల్ ఆరోపించారు. పోలీసు యంత్రాంగం అధికార పార్టీకి సహకరించిందని వ్యాఖ్యానించారు. బయట వ్యక్తులను తీసుకొచ్చి దొంగ ఓట్లు వేయించారని చెప్పిన ఆయన.. ఎన్నికల అధికారులు, పరిశీలకులు ప్రేక్షకపాత్ర వహించారని చెప్పారు. బద్వేలులోని 28 పోలింగ్ కేంద్రాల్లో పెద్దఎత్తున అక్రమాలు జరిగాయని.. అక్రమాలు జరిగిన చోట రీ-పోలింగ్ జరపాలని ఈసీని కోరామన్నారు.
తిరుపతిలో లాగే బద్వేలులోనూ: సునీల్ ధియోదర్
బద్వేలులో వైకాపా కొత్త సంప్రదాయానికి తెరతీసిందని భాజపా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ సునీల్ ధియోదర్ ఆరోపణలు చేశారు. బూత్‌ల వద్ద ఫొటో ఐడీ లేని ఓటరు స్లిప్పులు పంచారని చెప్పారు. తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికలో చేసినట్లు బద్వేలులోనూ చేశారన్నారు.
ఇదీ చదవండి