ETV Bharat / city

జగన్​ ప్రభుత్వ వైఫల్యాలపై.. 5వేల గ్రామాల్లో ప్రజా బహిరంగ సభలు: సోము - భాజపా ప్రజా బహిరంగ సభ

Somu Veerraju: ప్రధాని మోదీ పాలనలో రాష్ట్రానికి వచ్చిన వివిధ ప్రాజెక్టులు, అమలవుతున్నసంక్షేమ పథకాలు గురించి 5వేల గ్రామాల్లో ప్రజా బహిరంగ సభల ద్వారా వివరిస్తామని సోము వీర్రాజు పేర్కొన్నారు. డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఉండటం వల్ల ఆయా రాష్ట్రాలలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను గురించి ప్రజలకు ప్రత్యేకంగా ఈ వీధి బహిరంగ సభల్లో తెలియజేస్తామన్నారు.

SOMU FIRES ON JAGAN
SOMU FIRES ON JAGAN
author img

By

Published : Sep 2, 2022, 3:34 PM IST

Somu Veerraju fires on YSRCP government: రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో జగన్ ప్రభుత్వ వైఫల్యాలపై 5వేల గ్రామాల్లో ప్రజా బహిరంగ సభలను నిర్వహించనున్నట్లు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపారు. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలోని భాజపా ప్రభుత్వం గత 8 సంవత్సరాల కాలంలో రాష్ట్రానికి ఇచ్చిన అభివృద్ధి నిధులు, మంజూరు చేసిన అనేక విద్యాసంస్థలు, ఎయిమ్స్, ఈఎస్ఐ ఆసుపత్రుల సేవలు, నూతనంగా నిర్మిస్తున్న జాతీయ రహదారులు, పంచాయతీల అభివృద్ధి, జల్ జీవన్ మిషన్, కరోనా సమయంలో ప్రారంభించన ఉచిత బియ్యం, పీఎం కిసాన్ ద్వారా రైతులకు చేస్తున్న ఆర్థిక సహాయం వంటి అనేక సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రజలకు ఈ సభల ద్వారా వివరిస్తామని ఆయన పేర్కొన్నారు.

డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఉండటం వల్ల ఆయా రాష్ట్రాలలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను గురించి ప్రజలకు ప్రత్యేకంగా ఈ వీధి బహిరంగ సభల్లో తెలియజేస్తామన్నారు. కుటుంబ, వారసత్వ, అవినీతి, కులతత్వ పార్టీలను రాష్ట్ర ప్రజలు బహిష్కరించి.. 2024 సాధారణ ఎన్నికల్లో వారికి బుద్ధి చెప్పాలని సోము వీర్రాజు పిలుపునిచ్చారు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.