భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యక్తిగత ఖాతాను ఫేస్‌బుక్ తొలగించింది. ఫేస్‌బుక్‌తోపాటు.. ఇన్‌స్టాగ్రామ్‌లోనూ రాజాసింగ్ వ్యక్తిగత ఖాతాలను తొలగించారు. విద్వేషపూరిత సంభాషణలను, పోస్టులను పెట్టడంపై ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ రాజాసింగ్ ఖాతాలను నిషేధించింది.
విద్వేషపూరిత పోస్టులు పెట్టడం.. మా వేదికలో నిషేధం. మీరు మా విధానాలను ఉల్లఘించినందుకు ఖాతాను నిషేంధిస్తున్నాం.. అని ఫేస్‌బుక్ ఓ ఈమెయిల్ ప్రకటనలో తెలిపింది.
300 మిలియన్లకు పైగా ఫేస్‌బుక్‌కు వినియోగదారులు ఉన్నారు. అయితే రాజా సింగ్ పోస్టులు భారతదేశంలో అధికార పార్టీకి అనుకూలంగా ఉన్నాయని వాల్‌స్ట్రీట్ జర్నల్ నివేదికలో తేలింది. ఆ నివేదిక నేపథ్యంలో సామాజిక మాధ్యమాన్ని దుర్వినియోగం చేశారనే అంశంపై చర్చిండానికి.. పార్లమెంటరీ ప్యానెల్ ఫేస్‌బుక్ ప్రతినిధులను బుధవారం పిలిచింది. మంగళవారం కేంద్ర ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్.. ఈ విషయంపై ఫేస్‌బుక్ చీఫ్ మార్క్ జుకర్బర్క్కు లేఖ రాశారు.
ఫేస్‌బుక్‌లో తన వ్యక్తిగత ఖాతాను తొలగించడంపై రాజాసింగ్ స్పందించారు. తన పేరుతో ఫేస్‌బుక్‌లో చాలా ఖాతాలు ఉన్నట్లు ఈ సందర్భంగా తెలిసిందని అన్నారు. తనకు తెలియకుండా ఫేస్‌బుక్ ఖాతాలు తెరవడం అక్రమమని పేర్కొన్నారు. తన పేరుతో ఉన్న ఖాతాలను తొలగించినందుకు ఫేస్‌బుక్‌కు ధన్యవాదాలు తెలిపారు. 2018లో తెరిచిన తన అధికారిక ఖాతాను సైతం నిలిపివేశారని చెప్పారు. తన అధికారిక ఖాతాను వెంటనే పునరుద్ధరించాలని.. ఫేస్‌బుక్ అధికారులకు తెలియజేస్తున్నట్లు వివరించారు.
ఇదీ చూడండి: విద్యుత్ నగదు బదిలీ పథకానికి మంత్రివర్గం ఆమోదం