నేటి భోగి మంటలు కారాదు అమరావతి చితిమంటలు పేరుతో... రాజధాని గ్రామాల రైతులు భోగి మంటల వేడుక చేశారు. తుళ్లూరులో నిర్వహించిన భోగి మంటల్లో గుంటూరు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ బాధ్యులు తెనాలి శ్రావణ్ కుమార్, రాజధాని ఐక్యకార్యాచరణ సమితి నేతలు పాల్గొన్నారు. అమరావతికి వ్యతిరేకంగా రూపొందించిన చట్టాల ప్రతులను భోగి మంటల్లో వేసి దగ్ధం చేశారు. మహిళలు జానపదాలు పాడుతూ పండగ చేస్తూనే.. నిరసన కొనసాగించారు.
వెలగపూడిలో హరిదాసులతో కలిసి రైతులు భోగి మంటలు వేశారు. వెంకటపాలెం, అబ్బరాజుపాలెం, బోరుపాలెం, కృష్ణాయపాలెంలో రైతులు ఘనంగా భోగి మంటలు నిర్వహించారు. మూడు రాజధానులు వద్దు.. అమరావతే ముద్దు అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ఇవీ చూడండి: