Bharat Biotech donation: తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్లోని భారత్ బయోటెక్ యాజమాన్యం తమ ఉదారతను చాటింది. మానవతా దృక్పథంతో సేవాభావాన్ని నిరూపించుకుంది. భద్రాద్రి రామయ్య సన్నిధికి వచ్చే భక్తుల నిత్యాన్నదానానికి కోటి రూపాయల విరాళాన్ని అందించింది. కరోనా కట్టడికి కొవాగ్జిన్ రూపకల్పనలో విశేషంగా కృషి చేసిన భారత్ బయోటెక్ యాజమాన్యం.. ఈ మొత్తాన్ని ఆలయానికి సంబంధించిన బ్యాంకు ఖాతాలో జమ చేసింది.
భద్రాద్రి రామయ్య సన్నిధిలో ప్రతి రోజు జరిగే అన్నదానానికి కోటి రూపాయలు అందజేసినట్లు భారత బయోటెక్ ప్రకటించింది. కరోనా కట్టడికి కొవాగ్జిన్ వ్యాక్సిన్ రూపొందించిన భారత్ బయోటెక్ విశేషంగా కృషి చేసింది. ఇప్పటికే ఆలయ అధికారులు ప్రతి రోజు భక్తులకు నిత్యాన్నదానం అందిస్తున్నారు.
దుర్గమ్మకు కోటి బదిలీ: గతంలో ఏపీలోని విజయవాడ శ్రీ దుర్గామల్లేశ్వరస్వామివార్ల దేవస్థానం నిత్యాన్నదాన పథకానికి భారత్ బయోటెక్ సంస్థ రూ.కోటి విరాళాన్ని అందజేసింది. ఆన్‌లైన్ ఖాతాలో ఆ మొత్తాన్ని జమ చేసింది. ముందుగా భారత్ బయోటెక్ ప్రతినిధులు దేవస్థానం అధికారులను సంప్రదించి బ్యాంకు ఖాతా నెంబరు తీసుకున్నారు. తర్వాత విరాళం మొత్తాన్ని ఆన్లైన్లో బదిలీ చేశారు.
ఇవీ చూడండి: ఆ సీక్రెట్ చెప్పేసిన రష్మిక.. నటి కాకముందు ఎలా ఉండేదంటే?