ETV Bharat / city

రాష్ట్రంలో ప్రశాంతం : మధ్యాహ్నం వరకు ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం - Bharat Bandh effect on Vijayawada

కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిర్వహించిన భారత్‌బంద్ ప్రభావం రాష్ట్రంలోనూ కనిపించింది. బంద్‌కు రాష్ట్ర ప్రభుత్వంతోపాటు వివిధ రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, రైతు, కార్మిక సంఘాలు మద్దతు తెలిపాయి. రాష్ట్రవ్యాప్తంగా వామపక్షాల ఆధ్వర్యంలో ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు. వర్తక, వాణిజ్య వ్యాపారులు స్వచ్ఛందంగా బంద్‌లో పాలుపంచుకున్నారు.

Bharat Bandh In Andhra Pradesh
రాష్ట్రవ్యాప్తంగా 'భారత్ బంద్'కు భారీ స్పందన
author img

By

Published : Dec 8, 2020, 6:56 PM IST

Updated : Dec 9, 2020, 5:04 AM IST

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాల్ని రద్దు చేయాలన్న డిమాండుతో రైతు సంఘాలు మంగళవారం చేపట్టిన భారత్‌ బంద్‌ రాష్ట్రంలో ప్రశాంతంగా జరిగింది. కాంగ్రెస్‌, సీపీఎం, సీపీఐతో పాటు పలు ప్రజా, కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున బంద్‌లో పాల్గొన్నాయి. ఆర్టీసీ బస్సులు మధ్యాహ్నం ఒంటిగంట వరకూ డిపోలకే పరిమితమయ్యాయి. పలుచోట్ల విద్యాసంస్థలు, వ్యాపార సముదాయాలు మూతపడ్డాయి. చాలా చోట్ల ప్రభుత్వ కార్యాలయాలూ తెరుచుకోలేదు. అమరావతి రాజధాని పరిరక్షణ సమితి ఐకాస ప్రతినిధులు కూడా ఈ బంద్‌లో పాల్గొని... రైతు ఉద్యమానికి మద్దతు ప్రకటించారు.

ఊరూవాడా నిరసనలు
విజయవాడ పండిట్‌ నెహ్రూ బస్టాండు ప్రధాన ద్వారం వద్ద సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్‌, ఆమ్‌ ఆద్మీ పార్టీలు, వివిధ సంఘాల ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన జరిగింది. సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శులు రామకృష్ణ, పి.మధు, ఏపీ పట్టణ పౌరసమాఖ్య రాష్ట్ర కన్వీనర్‌ బాబూరావు, తదితరులు పాల్గొని నిరసన తెలిపారు. మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు ఉయ్యూరులో జరిగిన నిరసన కార్యక్రమాల్లో పాల్గొని మాట్లాడారు. హనుమాన్‌ జంక్షన్‌లో జరిగిన ప్రదర్శనలో సాగునీటి సంఘాల సమాఖ్య అధ్యక్షుడు ఆళ్ల గోపాలకృష్ణ, తదితరులు పాల్గొన్నారు. జగ్గయ్యపేట మండలం గౌరవరంలో జరిగిన నిరసనల్లో మాజీ ఎమ్మెల్యే, తెదేపా జాతీయ కోశాధికారి శ్రీరామ్‌ రాజగోపాల్‌ పాల్గొన్నారు. విజయవాడ లెనిన్‌ సెంటర్‌లో వ్యవసాయ సంఘాల ఐకాస ఆధ్వర్యంలో వ్యవసాయ పనిముట్లతో వినూత్న నిరసన ప్రదర్శన జరిగింది.

రాష్ట్రవ్యాప్తంగా 'భారత్ బంద్'కు భారీ స్పందన

కదలని బస్సులు
గుంటూరు ఎన్టీఆర్‌ బస్టాండు ఎదుట వామపక్షాలు, కాంగ్రెస్‌, ప్రజా, కార్మిక సంఘాల నాయకులు, ప్రతినిధులు నిరసన తెలిపారు. జిల్లాలో 577 ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ప్రైవేటు బస్సులు, ఆటోల్ని అడ్డుకోవటంతో ప్రైవేటు రవాణా కూడా మధ్యాహ్నం వరకూ స్తంభించింది. నరసరావుపేటలో అఖిలపక్ష నేతలు బంద్‌లో పాల్గొన్న అనంతరం సబ్‌కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. మంగళగిరి, తాడేపల్లి, బాపట్ల, రొంపిచర్ల, పెదకాకాని, నకరికల్లు, పెదకూరపాడు, తెనాలి, దుగ్గిరాల, మేడికొండూరు, ఫిరంగిపురం, అచ్చంపేట, రేపల్లె, వట్టిచెరుకూరు, పిడుగురాళ్ల, వినుకొండలో అఖిలపక్షం ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో చేశారు.

ప్రకాశంలో భారీ ర్యాలీ
ప్రకాశం జిల్లా ఒంగోలు, చీరాల, మార్కాపురం తదితర ప్రాంతాల్లో రైతు సంఘాలతో కలిసి వామపక్షాలు నిరసన చేపట్టాయి. ఒంగోలులో కర్నూల్‌ రోడ్డు కూడలి నుంచి ప్రకాశం భవనం వరకు భారీ ర్యాలీ నిర్వహించాయి. జిల్లాలో పలు కార్యాలయాలు, విద్యాసంస్థలు మూతపడ్డాయి.

తిరుపతిలో వరిపైరుతో నిరసన
చిత్తూరు జిల్లాలోని అన్ని బస్‌ డిపోల వద్ద సీపీఎం, సీపీఐ, కాంగ్రెస్‌ నాయకులు నిరసనలు చేపట్టారు. తిరుమల వెళ్లే ఆర్టీసీ బస్సులు మాత్రమే నడిచాయి. తిరుపతిలోని అంబేడ్కర్‌ విగ్రహం వద్ద వరిపైరు ప్రదర్శించి నిరసన తెలిపారు. తనపల్లె క్రాస్‌ వద్ద రహదారిని దిగ్బంధించటంతో రాకపోకలు కొద్దిసేపు స్తంభించాయి.

జాతీయ రహదారులపై బైఠాయింపు
నెల్లూరు జిల్లాలో చెన్నై-కోల్‌కతా, ముంబయి జాతీయ రహదారులపై వివిధ పార్టీలకు చెందిన నాయకులు బైఠాయించి నిరసన తెలిపారు. నెల్లూరులో భారీ ప్రదర్శనలు జరిగాయి. ఆర్టీసీ బస్సులు సాయంత్రం వరకూ డిపోలకే పరిమితమయ్యాయి. కొన్నిచోట్ల వ్యాపార సంస్థలను స్వచ్ఛందంగా మూసేశారు. కోవూరు బజార్‌సెంటర్‌లో వామపక్షాలు, కాంగ్రెస్‌ రాస్తారోకో నిర్వహించాయి. ‘రైతును పొడిచిన వ్యవసాయ చట్ట ఖడ్గం’ అంటూ కావలిలో వినూత్నరీతిలో నిరసన తెలిపారు.

రహదారిపైనే భోజనాలు
విశాఖపట్నంలో పలుచోట్ల ఉదయం నుంచే స్వచ్ఛందంగా దుకాణాలు మూసేశారు. మద్దెలపాలెంలో వామపక్షాల ఆధ్వర్యంలో భారీ మానవహారం, రాస్తారోకో, ర్యాలీ నిర్వహించారు. అనకాపల్లి, పాడేరు, నర్సీపట్నం డివిజన్లలో బంద్‌ ప్రశాంతంగా జరిగింది. కొన్నిచోట్ల పెట్రోలు బంకులు మూతపడ్డాయి. మునగపాకలో రహదారి మధ్యనే కూర్చొని భోజనాలు చేసి నిరసన తెలిపారు. మద్దెలపాలెం వద్ద కాంగ్రెస్‌ శ్రేణులు నిరసన తెలుపుతున్న సందర్భంలో అటుగా సీబీఐ పూర్వపు జేడీ లక్ష్మీనారాయణ వెళ్తుండటంతో ఆయన కారును అడ్డుకున్నారు. లక్ష్మీనారాయణ కారు దిగి రైతులకు మద్దతు పలికారు.

ఉరితాళ్లతో ఆందోళన
కడప జిల్లా రాజంపేట బైపాస్‌లో కడప-రేణిగుంట జాతీయ రహదారిపై వామపక్షాలు, కాంగ్రెస్‌, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు రాస్తారోకో చేశారు. మెడకు ఉరితాళ్లు తగిలించుకుని నిరసన తెలిపారు. కర్నూలు, చిత్తూరు జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ అనంతపురం జిల్లా సోమదేవపల్లి జాతీయ రహదారిపై వామపక్షాలు బైఠాయించాయి. కర్నూలు, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలోనూ నిరసన కార్యక్రమాలు జరిగాయి. దక్షిణ మధ్య రైల్వే మజ్దూర్‌ యూనియన్‌, ఆల్‌ ఇండియా లోకో పైలట్ల సంఘం సభ్యులు రాజమహేంద్రవరం రైల్వేస్టేషన్‌ ఎదుట నిరసన తెలిపారు.

ఇదీ చదవండి: 'అలా చేయకపోతే చైనాతో పోటీ పడటం కష్టమే'

Last Updated : Dec 9, 2020, 5:04 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.