ETV Bharat / city

పోలీసుల అదుపులో తెలంగాణ భాజపా అధ్యక్షుడు - సిద్దిపేటలో పోలీసుల సోదాలపై బండి సంజయ్​ ఆగ్రహం

తెలంగాణ భాజపా అధ్యక్షుడు బండి సంజయ్​ను సిద్దిపేట శివారులో ఆ రాష్ట్ర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణ పోలీసులు అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. దుబ్బాక శాసనసభ ఉప ఎన్నికలు జరుగుతుంటే సిద్దిపేటలో దాడులు, సోదాలు చేయడం ఎన్నికల నియమావళికి విరుద్దమన్నారు. తెలంగాణ ప్రభుత్వ పోలీసు యంత్రాంగానిది దుందుడుకు చర్యగా విమర్శించారు.

bandi sanjay
bandi sanjay
author img

By

Published : Oct 26, 2020, 11:43 PM IST

తెలంగాణ పోలీసులు అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని ఆ రాష్ట్ర భాజపా అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక శాసనసభ ఉప ఎన్నికలు జరుగుతుంటే సిద్దిపేటలో దాడులు, సోదాలు చేయడం ఎన్నికల నియమావళికి విరుద్ధమన్నారు. తెలంగాణ ప్రభుత్వ పోలీసు యంత్రాంగానిది దుందుడుకు చర్యగా విమర్శించారు.

దాడి జరిగిన కుటుంబసభ్యులను కలవడానికి సిద్దిపేటకు బయలుదేరి వెళుతుండగా సిద్దిపేట శివారులో బండి సంజయ్​ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కరీంనగర్​కు తరలించారు. ఈ విషయంపై బండి సంజయ్ ఆగ్రహించారు. ఈ విధానాన్ని తమ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఇదీ చదవండి: కేసుల మాఫీ కోసం పోలవరం తాకట్టు పెట్టారు: లోకేశ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.