ETV Bharat / city

అయోధ్య రామ మందిర నిర్మాణానికి బండి సంజయ్ విరాళం - Ayodhya Ramalaya latest news

అయోధ్య రామమందిర నిర్మాణానికి బండి సంజయ్ విరాళమిచ్చారు. ఒక లక్ష రూపాయల చెక్​ను శ్రీరామ జన్మభూమి తీర్ధ క్షేత్ర ట్రస్ట్ సభ్యులకు అందించారు.

bandi-sanjay-donates-for-the-construction-of-ayodhya-ram-mandi
అయోధ్య రామ మందిర నిర్మాణానికి బండి సంజయ్ విరాళం
author img

By

Published : Feb 17, 2021, 10:36 AM IST

శ్రీరాముని జీవితమే మానవాళికి ఆదర్శమని.. అయోధ్యలో నిర్మాణమవుతున్న మందిరమే స్వాభిమాన సంకేతమని తెలంగాణ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పేర్కొన్నారు. అయోధ్య రామమందిర నిధి సమర్పణలో భాగంగా కరీంనగర్ పార్లమెంట్ కార్యాలయంలో శ్రీరామ జన్మభూమి తీర్ధ క్షేత్ర ట్రస్ట్ సభ్యులకు ఒక లక్ష రూపాయల నిధిని ఆయన విరాళంగా ఇచ్చారు.

అయోధ్య రామాలయ నిర్మాణానికి సమర్పణ చేసే.. అదృష్టం మన తరానికి రావడం పూర్వజన్మ సుకృతమేనని వెల్లడించారు. దేశంలోని ప్రతి కుటుంబం విరాళంతో అయోధ్య నిర్మాణం కావడం.. చారిత్రకమైనదని వ్యాఖ్యానించారు.

అయోధ్యలో రామమందిర నిర్మాణం జరగాలని హిందువులంతా ఆకాంక్షిస్తున్నారని తెలిపారు. ఈ మందిర నిర్మాణం కోసం.. ఎన్నో పోరాటాలు చేశారని చెప్పారు.

ఇదీ చదవండి: చిన్నారికి 'రూ.16కోట్ల' ఉచిత చికిత్స

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.