విప్లవ రచయితల సంఘం నేత వరవరరావుకు బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అనారోగ్య కారణాలతో వరవరరావుకు బెయిల్ జారీచేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. బీమా కొరేగావ్ కేసులో అరెస్టైన వరవరరావు.. తలోజా జైలులో ఉన్నారు. వరవరరావు కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా బెయిల్ మంజూరు చేయాలంటూ కుటుంబ సభ్యులు చేసిన విజ్ఞప్తికి న్యాయస్థానం సుముఖత తెలిపింది.
ఇదీ చూడండి: రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు ప్రశాంతం : ఎస్ఈసీ