తెదేపా ముఖ్య నేతలతో నేడు అధినేత చంద్రబాబు సమావేశం కానున్నారు. అమరావతిలోని పార్టీ కార్యాలయంలోనే ఈ సమావేశం జరగనుంది. తాజా రాజకీయ పరిణామాలపై పార్టీ ముఖ్యనేతలతో చంద్రబాబు చర్చించనున్నారు. అరకు నియోజకవర్గానికి చెందిన పలువురు.. ఈ సందర్భంగా పార్టీలో చేరనున్నారు.
విశాఖ పర్యటనకు లోకేశ్
విశాఖ జిల్లాలో నేడు తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ పర్యటించనున్నారు. ఉదయం నర్సీపట్నంలో ద్విచక్రవాహన ర్యాలీకి హాజరవుతారు. అనంతరం అక్కడే ఉన్న ఎన్టీఆర్ ఆస్పత్రిలో రక్తదాన శిబిరానికి వెళ్తారు. అయ్యనపాత్రుడి జన్మదిన వేడుకల సందర్భంగా ఈ శిబిర నిర్వహణకు ఆయన అనుచరులు ఏర్పాట్లు చేశారు. శిబిరంలో రక్త దాతలకు ఉచితంగా హెల్మెట్లు పంపిణీ చేస్తారు. అనంతరం సీబీఎం కాంపౌండ్ మైదానంలో బహిరంగ సభకు లోకేశ్ హాజరవుతారు.