పాఠశాలల్లో ఈ నెల 15 వరకు కార్యక్రమాల నిర్వహణకు రాష్ట్ర పాఠశాల విద్యా శాఖ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. ఇంటింటా మువ్వన్నెల జెండా కార్యక్రమంపై విద్యార్థుల్లో అవగాహన కల్పించాలి. 2వ తేదీ జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య జయంతి నిర్వహణ, 3వ తేదీ స్వాతంత్య్ర సమరయోధుల ఆధ్వర్యంలో సభలు, సమావేశాల నిర్వహణ, 4న విద్యార్థులకు దేశభక్తి గీతాల పోటీలను నిర్వహించాలి. 5న నాటికలు, ఏకపాత్రాభినయం, 7న ఎగ్జిబిషన్, 8న చిత్రలేఖనం పోటీలు, 11న హెరిటేజ్‌వాక్, 12న క్రీడా పోటీలు, 13న జాతీయ జెండాతో సెల్ఫీ తీసుకుని వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలి. 14న స్వాతంత్య్ర సమరయోధుల ఇళ్లకు నడక, 15న స్వాతంత్య్ర దినోత్సవం నిర్వహించాలని పాఠశాల విద్యా కమిషనర్ ఆదేశాలిచ్చారు.
ఇవీ చదవండి: