విజయవాడ నగరం నడిబొడ్డున.. జాతీయ రహదారిపై ఉన్న చెట్లను నరికివేయటంపై ఆవారా సంస్థ ఆగ్రహం వ్యక్తం చేసింది. పర్యావరణాన్ని కాపాడి పచ్చదనాన్ని పరిరక్షించాలని సంస్థ ప్రతినిధులు డిమాండ్ చేశారు. బెంజ్ సర్కిల్ 2వ పైవంతెనకు అనుమతి వచ్చిన మేరకు.. హైవే అథారిటీ అధికారులు పనులు ప్రారంభించారు. ఈ క్రమంలో స్క్రూబ్రిడ్జ్ నుంచి నోవాటెల్ వరకు పైవంతెనను నిర్మించనున్నారు.
మార్గమధ్యంలో వచ్చిన 178 చెట్లను తొలగించేందుకు అధికారులు అటవీశాఖ నుంచి అనుమతులు తీసుకున్నామని చెబుతున్నారని ఆవారా సంస్థ వ్యవస్థాపకులు ప్రొ. కాట్రగడ్డ అజయ్ అన్నారు. ఏళ్ల తరబడి పెరిగిన చెట్లను నిర్ధాక్షణ్యంగా నరికివేయటం సరికాదన్నారు. గతంలో పైవంతెన నిర్మించే సమయంలో అడ్డు వచ్చిన చెట్లను ట్రాన్స్ ప్లాన్ టేషన్ పద్ధతిలో తీసివేసి వేరే ప్రాంతంలో పెంచారని గుర్తు చేశారు.
ఇదీ చదవండి: