ETV Bharat / city

మా బంధువులే హత్య చేయించారు: హేమంత్ భార్య - హైదరాబాద్​ వార్తలు

హైదరాబాద్​ గచ్చిబౌలికి చెందిన హేమంత్​ హత్యపై అతని భార్య అవంతిక స్పందించారు. తన బావలు, వదినలు, మామయ్యలే హేమంత్​ను హత్య చేయించారని ఆరోపించారు. పెళ్లి ఇష్టం లేకుంటే తనను చంపాలి కాని హేమంత్​ను చంపడం ఏంటని ప్రశ్నించారు.

హేమంత్ భార్య
హేమంత్ భార్య
author img

By

Published : Sep 25, 2020, 11:55 AM IST

మా బంధువులే హత్య చేయించారు : హేమంత్ భార్య

‘‘హేమంత్‌ నేనూ ఎనిమిదేళ్లుగా ప్రేమించుకుంటున్నాం. జూన్‌ 10న వివాహం చేసుకున్నాం.‌ పెళ్లి తర్వాత చందానగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో సెటిల్‌మెంట్‌కు వెళ్లాం. నా పేరిట ఉన్న ఆస్తులన్నీ కుటుంబ సభ్యులకు రాసిచ్చేశా. అప్పటినుంచి వారికి దూరంగా గచ్చిబౌలిలో ఉంటున్నాం. మా నాన్నకు ఇష్టం లేకుంటే నన్ను చంపాలి... ఇంట్లో నుంచి బయటకు వెళ్లింది నేను.. మా బావలు, వదినలు, మామయ్యలు, ఇద్దరు రౌడీలు నిన్న సాయంత్రం మూడు కార్లలో వచ్చి మమ్మల్ని బలవంతంగా లాక్కెళ్లారు. నేను మధ్యలో కారులోంచి దూకేసి తప్పించుకున్నాను. హేమంత్‌ను రౌడీలు కొట్టుకుంటూ కారులో తీసుకెళ్లారు. నిందితులు కొల్లూరులో ఓఆర్‌ఆర్‌ ఎక్కి పటాన్​చెరులో దిగారు. మా బావలు, వదినలు, మామయ్యలే ఈ హత్య చేయించారు’’ అని హేమంత్‌ భార్య అవంతిక వెల్లడించారు.

ఇదీ చదవండి: తెలంగాణ: ప్రేమ వివాహం... పరువు హత్య...!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.