ఏపీలో సాంకేతిక సంస్కరణలు తీసుకువచ్చేందుకు ఉన్నత విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. వర్సిటీలు, ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ కళాశాలల్లో సంస్కరణలకు విద్యాశాఖ ఆదేశాలు ఇచ్చింది. విద్యాపరమైన, నిర్వహణపరమైన అంశాలను ఆటోమేషన్ చేయాలని సూచించింది. మెరుగైన సేవలందించేందుకు ఆటోమేషన్ ప్రక్రియ తప్పని సరి చేస్తూ మార్గదర్శకాలు చేసింది. అన్ని వర్సిటీలు, కళాశాలల్లో ఆటోమేషన్ ప్రక్రియ తప్పని సరి చేస్తూ ప్రభుత్వ మార్గదర్శకాలు జారీ చేసింది.సాంకేతిక పరంగా రాష్ట్ర ప్రభుత్వం ఇ-గవర్నెన్సు విధానం అమలు చేస్తుందన్న ప్రభుత్వం... విద్యాసంస్థలూ ఈ మార్గాన్ని అనుసరించాలని స్పష్టం చేసింది. సెమిస్టర్ల పరీక్ష ప్రక్రియ ఆటోమేషన్ చేయాల్సిందిగా ఉన్నత విద్యాశాఖ తెలిపింది. అండర్ గ్రాడ్యుయేట్, పీజీ, పీహెచ్‌డీ ప్రవేశాల ప్రక్రియ ఆటోమేషన్ చేయాలని తెలిపింది. పరీక్షా ఫలితాలు, డిగ్రీ పట్టాలు, మెమోలు డిజిటల్ విధానంలో అందించాలని సూచించింది. ఒకటే రియల్ టైమ్ డాష్ బోర్డు ఉండేలా చర్యలు చేపట్టినట్లు వెల్లడించింది.
ఇవీ చదవండి: ఆ సర్వీసులు ఉచితంగా అందించాలని సుప్రీంలో పిల్