ఈనెల 22న రంజాన్ మాసం చివరి శుక్రవారం రోజున లాక్డౌన్ను కట్టుదిట్టంగా అమలు చేసేందుకు తెలంగాణ రాష్ట్ర అధికార యంత్రాంగం సమాయత్తమవుతోంది. దీనికి సంబంధించిన బాధ్యతలను నగర పోలీసు కమిషనర్ అంజనీ కుమార్తో పాటు పలువురు ఉన్నతాధికారులకు అప్పగించారు.
అదే రోజున 'జాగ్నే కా రాత్' కూడా ఉండటం వల్ల ఆంక్షలు తప్పకుండా పాటించాలని పోలీసులు చెబుతున్నారు. బహిరంగ ప్రార్థనలకు ఎలాంటి అనుమతి లేదని.. ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలని సూచించారు.
ఇవీ చూడండి: పది పరీక్షల్లో సంస్కరణలు..బిట్ పేపర్ తొలగింపు